సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

కేసీఆర్ నడక, మాటతీరును చాలా కష్టం.. ప్రియదర్శి పరకాయ ప్రవేశం చేశాడు

ABN, Publish Date - Oct 01 , 2026 | 11:01 AM

ప్యారడైజ్ సినిమాలో కేసీఆర్ పాత్రలో నటించిన నటుడు ప్రియదర్శి బుధవారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావును ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

Priyadarshi kcr

ప్యారడైజ్ సినిమాలో కేసీఆర్ పాత్రలో నటించిన నటుడు ప్రియదర్శి (Priyadarshi) బుధవారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు (Harish Rao) ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సంద‌ర్భంగా హరీష్‌రావు ఆయనను శాలువాతో సత్కరించి జ్ఞాపిక అందజేశారు. తెలంగాణ కోసం కేసీఆర్ చేసిన సేవలను తెరపై అద్భుతంగా ప్రదర్శించారన్నారు.

ఆత్మగౌరవం, అస్తిత్వం కోసం జరిగే పోరాటాలు ఒక జాతి విముక్తికి ఎలా స్ఫూర్తినిస్తాయో తెలంగాణ సాధనలో చూశామని హరీశ్రావు పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాత్రలో ప్రియదర్శి జీవించారని కొనియాడారు. నడక, మాటతీరును పట్టుకోవడం చాలా కష్టమని, కానీ ఆ పాత్రలో ప్రియదర్శి పరకాయ ప్రవేశం చేశారని అన్నారు.

Updated Date - Oct 01 , 2026 | 11:10 AM