సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Brahmanandam: కామెడీని, కమెడియన్‌ని.. చీపుగా చూడొద్దు

ABN, Publish Date - Feb 02 , 2026 | 06:46 AM

ప్రముఖ హాస్యనటుడు, హ‌స్య బ్ర‌హ్మ‌, మీమ్ గాడ్ పద్మశ్రీ అవార్డు గ్రహీత బ్రహ్మానందం (Brahmanandam) 70వ పుట్టినరోజు వేడుకలు ఆదివారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి.

Brahmanandam

ప్రముఖ హాస్యనటుడు, హ‌స్య బ్ర‌హ్మ‌, మీమ్ గాడ్, పద్మశ్రీ అవార్డ్ గ్రహీత బ్రహ్మానందం (Brahmanandam) 70వ పుట్టినరోజు వేడుకలు ఆదివారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులు భారీగా హాజరై బ్రహ్మానందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు ప్రత్యేకంగా పాల్గొని శాలువాతో బ్రహ్మానందాన్ని సత్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'బ్రహ్మానందంలో నేను కేవలం హాస్యనటుడిని కాదు, గొప్ప నటుడిని చూశాను. ఆయన చేసిన పాత్రలు తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయాయి. రోజూ ఆయనను గుర్తు చేసుకోని తెలుగు ప్రేక్షకుడు ఉండడు' అని ప్రశంసించారు. ఆపై ఎల్బీ శ్రీరామ్, బాబు మోహన్, ఉత్తేజ్, రఘుబాబు, పృథ్వీరాజ్, రచ్చ రవి, సంపూర్ణేశ్ బాబు, ప్రగతి, బిత్తిరి స‌త్తి వంటి ప్ర‌ముఖులు త‌మ అనుభ‌వాల‌ను వివ‌రించారు. బ్రహ్మానందంతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

చివ‌ర‌గా బ్రహ్మానందం మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. '42 ఏళ్ల నా సినీ ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. అయినా ఇన్నేళ్ల పాటు కొనసాగుతున్నానంటే అది నా గొప్పతనం కాదు, ప్రేక్షకుల ఆశీస్సులే కారణం. వారి ప్రేమ లేకపోతే నేనీ స్థాయిలో ఉండేవాడిని కాదు' అని అన్నారు. 'నన్ను చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన దర్శకుడు జంధ్యాల, నటుడు చిరంజీవి, నిర్మాత డి. రామానాయుడు. నా ప్రతిభను గుర్తించి చిరంజీవి గారు ఎంతోమందికి నన్ను పరిచయం చేశారు. జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన ‘అహనా పెళ్లంట’ సినిమా నా జీవితాన్ని మార్చేసింది. ఆ విజయం తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు' అని తెలిపారు.

Updated Date - Feb 02 , 2026 | 12:44 PM