బాలయ్యను పక్కనపెట్టిన బోయపాటి.. ఆ హీరోతో సక్సెస్ కొడతాడా!
ABN , Publish Date - Jun 26 , 2026 | 09:44 PM
టాలీవుడ్‌లో యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అంటే మనకు ఠక్కున గుర్తొచ్చే పేరు బోయపాటి శ్రీను. బాక్సాఫీస్ దగ్గర ఊర మాస్ జాతర ఎలా ఉంటుందో చూపించడంలో ఆయనకు ఆయనే సాటి.
టాలీవుడ్‌లో యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అంటే మనకు ఠక్కున గుర్తొచ్చే పేరు బోయపాటి శ్రీను (Boyapati Srinu). బాక్సాఫీస్ దగ్గర ఊర మాస్ జాతర ఎలా ఉంటుందో చూపించడంలో ఆయనకు ఆయనే సాటి. తెర మీద హీరో ఎలివేషన్స్, గూస్‌బంప్స్ తెప్పించే ఫైట్ సీక్వెన్స్‌లు తెరకెక్కించడంలో బోయపాటి రూటే సపరేటు. ఇక నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), బోయపాటి కాంబినేషన్ అంటే థియేటర్లలో ఎలాంటి రికార్డులు బద్దలవుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘సింహా, లెజెండ్, అఖండ...’ ఇలా వీళ్ల కలయికలో వచ్చిన ప్రతీ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టించినవే..
కానీ, ఇక్కడే ఒక పెద్ద చిక్కు వచ్చి పడింది. బాలయ్యతో తప్ప మిగతా హీరోలతో బోయపాటి యాక్షన్ ఫార్ములా ఎందుకో అంతగా వర్కవుట్ కావడం లేదు. గత కొన్నేళ్ల ట్రాక్ రికార్డ్ గమనిస్తే... బాలకృష్ణ సినిమాలు మినహాయించి, ఇతర హీరోలతో ఆయన తీసిన సినిమాలన్నీ దాదాపుగా యావరేజ్, లేదంటే డిజాస్టర్ టాక్ మాత్రమే తెచ్చుకున్నాయి. పోనీ బాలయ్యతో మళ్లీ ఆ మ్యాజిక్ రిపీట్ చేద్దామని గతేడాది ఎన్నో అంచనాల మధ్య ‘అఖండ-2’ (Akhanda 2)తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సినిమాకు యావరేజ్ టాక్ అయితే వచ్చింది కానీ, కలెక్షన్స్ పరంగా మాత్రం ఏమాత్రం సేఫ్ జోన్‌లోకి రాలేకపోయింది. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. ఈ సినిమా నిర్మాతకు ఏకంగా రూ. 80 కోట్లకు పైగా భారీ నష్టాలను మిగిల్చింది. సరిగ్గా ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో తన ట్రాక్ రికార్డును తిరిగి బలంగా మార్చుకునేందుకు బోయపాటి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం ఏకంగా కోలీవుడ్ వైపు అడుగులు వేస్తున్నారు. కోలీవుడ్ స్టార్ హీరో, వర్సటైల్ యాక్టర్ సూర్యతో ఓ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఇప్పటికే సూర్య (Suriya)కు ఈ కథ వినిపించడం, ఆయన స్టోరీ లైన్ అద్భుతంగా ఉందని గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కూడా జరిగిపోయాయట. ఏమాత్రం ఆలస్యం చేయకుండా బోయపాటి ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా స్టార్ట్ చేసేశారు. సూర్య మార్క్ ఇంటెన్స్ యాక్టింగ్, బోయపాటి మార్క్ రా అండ్ రస్టిక్ యాక్షన్... ఈ రెండు కలిస్తే స్క్రీన్ మీద రచ్చ మామూలుగా ఉండదు. ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ ఓ రేంజ్‌లో ఉండబోతున్నాయని ఇండస్ట్రీలో టాక్. అలాగే కేవలం సౌత్ వరకే పరిమితం కాకుండా, నార్త్ ఆడియన్స్‌ను కూడా బలంగా ఆకర్షించేలా ఈ కథను పాన్ ఇండియా స్థాయిలో సిద్ధం చేసినట్లు సమాచారం. దీనితో పాటు, బోయపాటి మరో టాలీవుడ్ హీరోను కూడా లైన్‌లో పెట్టే పనిలో తీవ్రంగా ఉన్నారట. మరి ఆ హీరో ఎవరు అన్నది త్వరలోనే తెలియనుంది. మొత్తానికి బాలయ్యతో మాత్రమే హిట్లు కొడతారనే విమర్శను దాటి, సూర్యతో తీయబోయే ఈ పాన్ ఇండియా ప్రాజెక్టుతో బోయపాటి తన సత్తా ఏంటో మళ్లీ నిరూపించుకుంటారో లేదో చూడాలి.
ఇవి కూడా చదవండి:
‘జననాయగన్’ నిర్మాతకు తమిళనాడు ప్రభుత్వం కీలక బాధ్యత!
సీఎంకి కాబోయే భార్యనా.. మజాకానా.. 3 కోట్ల నెక్లెస్ తో త్రిష రచ్చ
జక్కన్న షాక్ మాములుగా లేదుగా..! హీరోలు ఇక క్యూ కట్టవచ్చు