సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

అబ్సెషన్.. ఏముందని అంత లేపార్రా

ABN, Publish Date - Nov 15 , 2026 | 05:35 PM

ఈమధ్యకాలంలో ప్రేక్షకులు సినిమాలు చూసే తీరు మారుతుంది. థియేటర్ హిట్ అయిన సినిమాని ఓటీటీలో చూసి బాలేదని చెప్పేస్తున్నారు. లేదా, థియేటర్ లో ప్లాప్, క్రింజ్ అని చెప్పిన సినిమాని ఓటీటీలో ఎత్తేస్తున్నారు.

Obsession

ఈమధ్యకాలంలో ప్రేక్షకులు సినిమాలు చూసే తీరు మారుతుంది. థియేటర్ హిట్ అయిన సినిమాని ఓటీటీలో చూసి బాలేదని చెప్పేస్తున్నారు. లేదా, థియేటర్ లో ప్లాప్, క్రింజ్ అని చెప్పిన సినిమాని ఓటీటీలో ఎత్తేస్తున్నారు. ఈ ఏడాది రిలీజ్ అయిన హాలీవుడ్ సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం అబ్సెషన్ (Obsession) బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ హిట్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా, ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుని ఏకంగా రూ. 800 కోట్లకు పైగాభారీ వసూళ్లను కొల్లగొట్టి సంచలనం సృష్టించింది. థియేటర్లలో ఇంతటి భారీ విజయం సాధించడంతో ఇండియన్ సినీ లవర్స్, ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. తాజాగా ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియో హాట్‌స్టార్ (JioHotstar) వేదికగా తెలుగుతో పాటు అన్ని ప్రధాన భారతీయ భాషల్లో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది.


అయితే ఎన్నో అంచనాలతో జియో హాట్‌స్టార్‌లో ఈ సినిమాను చూసిన తెలుగు ప్రేక్షకులు మాత్రం తీవ్ర నిరాశకు గురవుతూ పెదవి విరుస్తున్నారు. అసలు ఏముందని ఈ సినిమాకు ఇంత హైప్ ఇచ్చారు? అంటూ సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. బేర్ (మైఖేల్ జాన్‌స్టన్) ఒక మ్యూజిక్ స్టోర్‌లో పనిచేసే సాధారణ యువకుడు. తనతో పాటు పనిచేసే చిన్ననాటి స్నేహితురాలు నిక్కీ (ఇండే నవారెట్)ని ప్రాణంగా ప్రేమిస్తుంటాడు. కానీ తన ప్రేమను వ్యక్తపరచడానికి మొహమాటపడుతుంటాడు. ఒకరోజు నిక్కీకి గిఫ్ట్ కొనడానికి ఒక క్రిస్టల్ షాప్‌కు వెళ్లిన బేర్‌కు అక్కడ వన్ విష్ విల్లో అనే ఒక మిస్టీరియస్ బొమ్మ కనిపిస్తుంది. దాన్ని విరిచి ఏదైనా కోరిక కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుందని తెలుసుకున్న బేర్.. నిక్కీ నన్ను పిచ్చిగా ప్రేమించాలి అని కోరుకుంటాడు. బేర్ కోరిక ఫలిస్తుంది. కానీ అది మామూలు ప్రేమలా కాకుండా ఒక భయానకమైన, హింసాత్మకమైన వ్యామోహంగా మారుతుంది. నిక్కీ ప్రవర్తన ఒక్కసారిగా మారిపోతుంది. ఆ ప్రవర్తనతో విసిగిపోయిన బేర్ ఏం చేశాడు.. ? నిక్కీ చివరకు మామూలు మనిషి అవుతుందా.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.


విశ్లేషణాత్మకంగా చూస్తే.. హాలీవుడ్ ఆడియన్స్‌కు కనెక్ట్ అయిన స్లో-పేస్డ్ సైకలాజికల్ ఎలిమెంట్స్, డార్క్ టోన్ తెలుగు ఆడియన్స్ అభిరుచికి ఏమాత్రం సెట్ కాలేదు. కథలో వేగం లేకపోవడం, ఊహించదగిన మలుపులు ఉండటంతో పాటు తెలుగు డబ్బింగ్ కూడా అంతగా ఆకట్టుకోలేకపోవడం ఈ సినిమాకు మైనస్‌గా మారింది. ముఖ్యంగా నిక్కీ పాత్ర చూసేకొద్దీ చాలామందికి చిరాకు వస్తుంది. ఆ అమ్మాయి పిచ్చిదో.. లేక ఆ విష్ వలన అలా చేస్తుందో తెలియక కన్ఫ్యూజన్ లా ఉంటుంది. సినిమా చూసిన చాలామంది నెటిజన్స్.. సినిమాలో ఏం లేదు.. అంతా డొల్ల. ఇంతకన్నా మంచి హర్రర్ సినిమాలు తెలుగులో ఉన్నాయి. ఎలా ఈ సినిమాని హిట్ చేశారు అని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఇదొక మంచి ఎక్స్పిరియెన్స్. ఓటీటీలో ఒకసారి చూడడానికి బావుంది అని చెప్పుకొస్తున్నారు. మరి ఓటీటీలో కూడా ఈ సినిమా రికార్డులు సృష్టిస్తుందేమో చూడాలి.

Updated Date - Nov 15 , 2026 | 05:39 PM