బూకీ.. అందరికీ కనెక్టయ్యే చిత్రం
ABN, Publish Date - Feb 18 , 2026 | 08:07 AM
అజయ్ దిషన్, ధనుషా జంటగా గణేశ్ చంద్ర దర్శక త్వంలో రూపొందిన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ బూకీ.
అజయ్ దిషన్ (Ajay Dhishan), ధనుషా (R K Dhanusha) జంటగా గణేశ్ చంద్ర దర్శక త్వంలో రూపొందిన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ బూకీ (Bookie). విజయ్ ఆంటోని (Vijay Antony) సమర్పణలో శరవంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్‌పై రామాంజనేయులు జువ్వాజి దీనిని నిర్మించారు. ఈనెల 20న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా మేకర్స్ హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. విజయ్ ఆంటోని మాట్లాడుతూ 'మార్గన్' తో అజయ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 'బూకీ'లో కూడా తన నటనతో మీ అందరినీ అలరిస్తాడు. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ప్రతిభను ప్రోత్సహిస్తారు. తనని కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అందరికీ కనెక్ట్ అయ్యే చిత్రమిది' అని అన్నారు.
హీరో అజయ్ దిషన్ మాట్లాడుతూ 'ఇందులో అందరూ రిలేట్ చేసుకునే క్యారెక్టర్లో కనిపిస్తాను. సంగీతం పరంగా సినిమా అద్భుతంగా ఉంటుంది' అని అన్నారు.