సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

రాకా.. ఎంతమందిని దింపుతావ్ అట్లీ

ABN, Publish Date - Nov 23 , 2026 | 05:21 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), స్టార్ డైరెక్టర్ అట్లీ (Atlee) కాంబినేషన్‌లో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న పాన్-ఇండియా చిత్రం రాకా (Raka).

Raaka

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), స్టార్ డైరెక్టర్ అట్లీ (Atlee) కాంబినేషన్‌లో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న పాన్-ఇండియా చిత్రం రాకా (Raka). ఈ సినిమా మొదలైన దగ్గరనుంచి ఎలాంటి వార్త వచ్చిన ఇట్టే వైరల్ గా మారిపోతుంది. ఇప్పటికే ఈ సినిమాలో స్టార్ హీరోయిన్స్, బాలీవుడ్ హీరోలు నటిస్తున్నారు అంటూ పుకార్లు షికార్లు చస్తూనే ఉన్నాయి. ఇప్పటికే ఈ భారీ ప్రాజెక్ట్‌లో దీపికా పడుకోణె (Deepika Padukone) కథానాయికగా నటిస్తుండగా, ఆమెతో పాటు మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur), జాన్వీ కపూర్ (Janhvi Kapoor), రష్మిక మందన్నాతో పాటు మరో ఇద్దరు హీరోయిన్లు కూడా నటిస్తున్నారు.


ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో గోవిందా కూడా నటిస్తున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. ఈమధ్యకాలంలో గోవిందా నుంచి ఎలాంటి సినిమాలు రాలేదు. ఆయన పాత్ర నిడివి తక్కువగానే ఉన్నప్పటికీ, కథలో దానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుందని టాక్ వినిపిస్తోంది. దీంతో ఈ చిత్రంపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన అల్లు అర్జున్ పోస్టర్ ఒక్కసారిగా హైప్ ని పెంచేసింది. అంతేకాకుండా రాకా లో బన్నీ మూడు పాత్రల్లో కనిపించనున్నాడని ఒక వార్త కూడా సర్క్యులేట్ అవుతుంది. అందుకు తగ్గట్లుగానే బన్నీ లుక్ కూడా మారుతూ వస్తుంది.


మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో ఓ శక్తివంతమైన డాన్ చుట్టూ ఈ సినిమా కథా నేపథ్యం సాగనుందని సమాచారం. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం అంతర్జాతీయ స్థాయి టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. అట్లీ మార్క్ మాస్ ఎలిమెంట్స్, అల్లు అర్జున్ స్టైలిష్ యాక్షన్‌తో పాటు ఈ స్టార్స్ కూడా రంగంలోకి దిగడంతో రాకా బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ముందు ముందు అట్లీ ఇంకెంతమందిని ఈ సినిమాలో భాగం చేస్తాడో చూడాలి.

Updated Date - Nov 23 , 2026 | 05:30 PM