Allu Sirish: అల్లు వారబ్బాయి బ్యాచిలర్ పార్టీ.. ఆ హీరోయిన్స్ ఎందుకొచ్చారో
ABN, Publish Date - Feb 02 , 2026 | 07:57 PM
అల్లు వారింట పెళ్ళి సందడి మొదలైంది. అల్లు అరవింద్ (Allu Aravind) మూడో కుమారుడు అల్లు శిరీష్ (Allu Sirish) త్వరలోనే పెళ్ళి పీటలు ఎక్కనున్న విషయం తెల్సిందే.
Allu Sirish: అల్లు వారింట పెళ్ళి సందడి మొదలైంది. అల్లు అరవింద్ (Allu Aravind) మూడో కుమారుడు అల్లు శిరీష్ (Allu Sirish) త్వరలోనే పెళ్ళి పీటలు ఎక్కనున్న విషయం తెల్సిందే. గతేడాది అక్టోబర్ లో శిరీష్ నిశ్చితార్థం నయనికా రెడ్డి (Nayanika Reddy) తో చాలా సింపుల్ గా జరిగింది. వీరి వివాహాం ఈ ఏడాది మార్చి 6 న జరగనుంది. పెళ్ళి డేట్ దగ్గరపడుతుండటంతో శిరీష్ - నయనికా వారి బ్యాచిలర్ పార్టీని దుబాయ్ లో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ పేరుతో ఈ పార్టీని నిర్వహించారు. అల్లు బ్రదర్స్ అయిన బాబీ, అర్జున్ (Allu Arjun), శిరీష్.. వారి ఫ్రెండ్స్, నయనికా ఫ్రెండ్స్ అందరూ ఈ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇక ఈ ఫోటోలలో బాలీవుడ్ హీరోయిన్స్ ఉండడం ప్రస్తుతం హాట్ టాపిక్ గామారింది. శిరీష్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో బాలీవుడ్ హాట్ హీరోయిన్స్ సోఫీ చౌదరి, సహీబా బాలి కనిపించారు. దీంతో బాలీవుడ్ లో శిరీష్ పేరు మారుమ్రోగుతోంది. సడెన్ గా బాలీవుడ్ ముద్దుగుమ్మలు శిరీష్ పార్టీకి ఎందుకు వచ్చారు అనేదానిపై పెద్ద చర్చనే జరుగుతోంది. అయితే అందుతున్న సమాచారం ప్రకారం అన్న అల్లు అర్జున్ కన్నా ముందే శిరీష్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నాడని, అందుకే బాలీవుడ్ మీడియాతో, స్టార్స్ తో స్నేహాలను పెంచుకుంటున్నాడని టాక్ నడుస్తోంది.
గీతా ఆర్ట్స్ ఎప్పటినుంచో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుందని వార్తలు వినిపిస్తున్నాయి. దానికోసం కొన్ని కథలను కూడా విన్నారట. శిరీష్ పెళ్ళి తరువాత ఆ లాంచింగ్ పనులను చూసుకోనున్నాడని అంటున్నారు. అదేంటి.. హీరోగా లాంచ్ అవుతున్నాడా అంటే కాదంట. ఇక నుంచి శిరీష్ తన తండ్రిలానే నిర్మాతగా కొనసాగనున్నట్లు సమాచారం. అందుకోసమే ఈ దుబాయ్ పార్టీ, బాలీవుడ్ హీరోయిన్స్, ఈ కవరేజ్ అని టాక్. టాలీవుడ్ లో గీతా ఆర్ట్స్ కు మంచి గుర్తింపు ఉంది. ఇప్పుడు బాలీవుడ్ లో కూడా తమ సత్తా చాటడానికి గీతా ఆర్ట్స్ సిద్దమైందని, దానికి అల్లు బ్రదర్స్ అన్ని విధాలా రంగం సిద్ధం చేశారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.