సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

నాని వెంటపడుతున్న బ్లాస్ట్ డైరెక్టర్..

ABN, Publish Date - Jul 04 , 2026 | 09:01 PM

న్యాచురల్ స్టార్ నాని(Nani) ప్రస్తుతం తన కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ ది ప్యారడైజ్ (The Paradise) పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. అయితే ఈ సినిమా అనుకున్న దానికంటే ఎక్కువ సమయం తీసుకోవడం వల్ల నాని కెరీర్‌లో చాలా టైమ్ తినేసింది అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు.

న్యాచురల్ స్టార్ నాని(Nani) ప్రస్తుతం తన కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ ది ప్యారడైజ్ (The Paradise) పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. అయితే ఈ సినిమా అనుకున్న దానికంటే ఎక్కువ సమయం తీసుకోవడం వల్ల నాని కెరీర్‌లో చాలా టైమ్ తినేసింది అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. ఒక ఏడాదిలో రెండు సినిమాలను ఫినిష్ చేసే నాని.. ఈ సినిమాకు కాస్త ఎక్కువ సమాయన్నే కేటాయించాడు. ఇక ఈ చిత్రం ఎప్పుడు విడుదలవుతుందనే దానిపై ఇప్పటికీ స్పష్టత లేకపోవడంతో అభిమానుల్లో కాస్త ఆందోళన నెలకొంది. సెప్టెంబర్ 25న సినిమా రిలీజ్ కానుందంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతున్నప్పటికీ, చిత్ర యూనిట్ నుంచి మాత్రం ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఈ క్రేజీ ప్రాజెక్ట్ థియేటర్లలోకి రావడానికి ఇంకొంత సమయం పట్టేలానే కనిపిస్తోంది.


ఇక ప్యారడైజ్ తరువాత నాని ప్లాన్ ఏంటి.. ? ప్రస్తుతం అందరిలో మెదులుతున్న ప్రశ్న ఇదే. ప్యారడైజ్ అవ్వగానే.. సుజీత్ తో నాని ఒక సినిమా చేయాల్సి ఉంది. అనౌన్స్‌మెంట్ అయితే వచ్చింది కానీ, ఇప్పటివరకు డాని గురించిన అప్డేట్ లేదు. ఇక సుజీత్.. నాని సినిమాను పక్కన పెట్టి ఓజీ 2 సినిమాతో బిజీగా మారాడు. దీంతో నాని నెక్స్ట్ ఏంటి అనేది ప్రశ్నార్ధకంగా మారింది. ఇక ఈ సమయంలోనే నాని తదుపరి సినిమాకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. అదేంటంటే.. బ్లాస్ట్ జోన్ తో ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ అందుకొన్న డైరెక్టర్ సుభాష్ కె రాజ్.. నాని కోసం గట్టిగా ట్రై చేస్తున్నాడట.


బ్లాస్ట్ సినిమా ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో అందరికీ తెల్సిందే. ఇంతటి భారీ సక్సెస్ తర్వాత సుభాష్ కె రాజ్‌తో సినిమాలు చేయడానికి చాలా మంది స్టార్ హీరోలు లైన్లో ఉన్నప్పటికీ, ఆయన మాత్రం నానితోనే ముందుకు వెళ్లాలని చూస్తున్నారట. అయితే ఈ క్రేజీ కాంబోకి నాని ఇంకా అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా లేదా అనేది తేలాల్సి ఉంది. ఒకవేళ ఈ కాంబినేషన్ గనుక సెట్ అయితే మాత్రం, నాని నుంచి ఒక ఊరమాస్ పక్కా యాక్షన్ కంటెంట్ ఉన్న సినిమా రావడం ఖాయమని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

Updated Date - Jul 04 , 2026 | 09:06 PM