సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

‘రాకాస’ను బీట్ చేసి.. స్పీడ్ పెంచిన శర్వా ‘బైకర్’

ABN, Publish Date - Apr 07 , 2026 | 03:26 PM

గత శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన శర్వానంద్ ‘బైకర్’, సంగీత శోభన్ ‘రాకాస’ చిత్రాలు మంచి ఓపెనింగ్స్‌నే రాబట్టాయి. ఒకవైపు ఐపీఎల్ నడుస్తున్నప్పటికీ కలెక్షన్లపరంగా రెండు సినిమాలు వీకెండ్‌లో బాగానే స్కోర్ చేశాయి. వీక్ డేస్‌లో మాత్రం ఈ సినిమాలు అంతగా ప్రభావం చూపలేక పోతున్నాయి.

Biker and Rakasa Movie

గత శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన శర్వానంద్ (Sharwanand) ‘బైకర్’ (Biker), సంగీత శోభన్ ‘రాకాస’ (Rakasa) చిత్రాలు మంచి ఓపెనింగ్స్‌నే రాబట్టాయి. ఒకవైపు ఐపీఎల్ నడుస్తున్నప్పటికీ కలెక్షన్లపరంగా రెండు సినిమాలు వీకెండ్‌లో బాగానే స్కోర్ చేశాయి. వీక్ డేస్‌లో మాత్రం ఈ సినిమాలు అంతగా ప్రభావం చూపలేకపోతున్నాయి. ఈ రెండు సినిమాలలో ‘రాకాస’ డామినేషన్ కనిపించినా, మౌత్ టాక్‌తో శర్వానంద్ ‘బైకర్’ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. ఇంటెన్స్ స్పోర్ట్స్ డ్రామాగా వచ్చిన ‘బైకర్’.. కామెడీ, ఫాంటసీ అంశాలతో వచ్చిన ‘రాకాస’.. ప్రేక్షకులను మెప్పించడంలో చాలా వరకు సక్సెస్ అయ్యాయి.


మొదటి వారాంతం ముగిసే సమయానికి, ఓవరాల్ కలెక్షన్ల పరంగా ‘రాకాస’ను బీట్ చేసి ‘బైకర్’ స్వల్ప ఆధిక్యంలో నిలిచింది. ఇక వీక్ డేస్‌లో కూడా ఈ రెండు సినిమాల మధ్య టికెట్ సేల్స్ ట్రెండ్ ఆసక్తికరంగా మారింది. వరుసగా మూడు రోజుల పాటు బుక్‌మైషో (bookmyshow) బుకింగ్స్‌లో ‘రాకాస’ ఆధిపత్యం చెలాయిస్తూ.. ‘బైకర్’ కంటే ఎక్కువ టికెట్లు అమ్ముడయ్యాయి. కానీ, చివరి 24 గంటల్లో ఈ లెక్కలన్నీ పూర్తిగా మారిపోయాయి. తాజా బుక్‌మైషో డేటా ప్రకారం.. ‘బైకర్’ స్పీడ్ భారీగా కాదు కానీ, కొంతమేరకు పెరిగిందనేలా రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఈ చిత్రం 24 గంటల్లో సుమారు 15.59K టికెట్ల సేల్స్‌తో దూసుకుపోతుండగా, ‘రాకాస’ సుమారు 13.73K టికెట్ల వద్ద నిలిచింది.


వీక్ డేస్ కావడంతో సాధారణంగానే రెండు సినిమాల వసూళ్లలో డ్రాప్ కనిపిస్తున్నప్పటికీ, ‘బైకర్’ మళ్ళీ పుంజుకోవడంతో బాక్సాఫీస్ వద్ద ఆసక్తికర పరిణామాలు మొదలయ్యాయి. ఈ వారం ఒక స్ట్రయిట్ చిత్రం, రెండు డబ్బింగ్ సినిమాలు బాక్సాఫీస్‌ ముందుకు రాబోతున్నాయి. వీటిలో ఏవైనా మంచి టాక్ తెచ్చుకుంటే మాత్రం, ఆ ప్రభావం ఈ రెండు సినిమాల కలెక్షన్స్‌పై పడే అవకాశం ఉంది. ఏదిఏమైనా, ఈ వీకెండ్ ఈ రెండు చిత్రాలకు చాలా కీలకం కాబోతోంది.

Updated Date - Apr 07 , 2026 | 05:30 PM