సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Bigg Boss10: బిగ్ బాస్ లో నరకం.. అందుకే ఆడలేకపోయా 

ABN, Publish Date - Sep 21 , 2026 | 01:45 PM

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 10లో ఆదివారం ఎపిసోడ్‌ వినోదంతో పాటు ఎమోషనల్ గా సాగింది. అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా నాగార్జున ప్రత్యేకంగా కనిపించారు.

బిగ్‌బాస్‌ (Biggboss) తెలుగు సీజన్‌10లో ఆదివారం ఎపిసోడ్‌ వినోదంతో పాటు ఎమోషనల్ గా సాగింది. అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా నాగార్జున ప్రత్యేకంగా కనిపించారు. ఏఎన్నార్‌ పాటలతో స్టేజ్‌పైకి ఎంట్రీ ఇచ్చిన ఆయన.. ప్రేక్షకులతో సరదాగా ముచ్చటించారు. హౌస్‌లో ఎవరి ఆట నచ్చుతోంది? ఎవరు బాగా ఆడుతున్నారు? అనే విషయాలను ప్రేక్షకులను అడిగి తెలుసుకున్నారు. చేనేత వస్త్రాలను ధరించిన ఆయన చేనేతకు ప్రతి ఒక్కరూ ప్రోత్సాహం అందించాలని కోరారు. హౌస్‌లో సభ్యులు పాటలు, డ్యాన్సులతో సందడి చేశారు. అయితే ఎపిసోడ్‌లో అసలు ట్విస్ట్‌ ఎలిమినేషన్‌ సమయంలో వచ్చింది. చివరి వరకు సృష్టి, కృష్ణుడు మాత్రమే ఉండగా కృష్ణుడు ఎలిమినేట్  అయ్యారు. నాగార్జున పిలవడంతో కృష్ణుడు స్టేజ్‌పైకి వచ్చి తన అనుభవాలను పంచుకున్నారు. తాను ఎలిమినేట్‌ అవుతున్నందుకు బాధపడటం లేదని కృష్ణుడు చెప్పారు. గత వారం తాను సరిగ్గా ఆడలేకపోయానని, మానసికంగా కూడా కొంత ఇబ్బందిగా అనిపించిందని తెలిపారు. ఎంత ప్రయత్నించినా అనుకున్న స్థాయిలో గేమ్‌ ఆడలేకపోయానని అన్నారు. 

కృష్ణుడు బయటకు వెళ్తున్న సమయంలో రోహిత్‌ మాత్రం తీవ్రంగా ఎమోషనల్‌ అయ్యాడు. కృష్ణుడి కళ్లు తన తండ్రిని గుర్తు చేస్తున్నాయని చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నాడు. రోహిత్‌ మాటలు విన్న కృష్ణుడు కూడా భావోద్వేగానికి గురయ్యారు. చిన్నవాళ్లను అర్థం చేసుకోవడంలో తాను కొన్నిసార్లు తప్పు చేశానని చెప్పారు. కోపంలో తనను తాను కంట్రోల్‌ చేసుకోలేకపోయానని, అందుకు బాధపడుతున్నానని తెలిపారు.స్టేజ్‌పై నాగార్జునతో మాట్లాడిన కృష్ణుడు తన ఆరోగ్యం గురించి కూడా చెప్పారు. గత ఎనిమిది రోజులుగా షుగర్‌ పూర్తిగా మానేయడంతో బలహీనంగా అనిపించిందని తెలిపారు. తాను సాధారణంగా చాలా స్వీట్స్‌ తింటానని, ఒక్కసారిగా వాటిని మానేయడం వల్ల తన ఆరోగ్యంపై ప్రభావం పడిందని చెప్పారు. దీనిపై నాగార్జున స్పందిస్తూ.. స్వీట్స్‌ను ఒక్కసారిగా కాకుండా క్రమంగా తగ్గించుకోవాలని సూచించారు. కృష్ణుడి ఎలిమినేషన్‌ సరదాగా  ఇంటి సభ్యులకు భావోద్వేగ క్షణాల్ని మిగిల్చింది. 

Updated Date - Sep 21 , 2026 | 02:43 PM