Pawan Kalyan Padala: రామ్ చరణ్ గాడునా.. ఎవడ్రా నిన్ను స్టేజ్ ఎక్కించింది
ABN, Publish Date - Aug 22 , 2026 | 03:22 PM
బిగ్‌బాస్ విన్నర్ కళ్యాణ్ పడాల ఒకప్పుడు దేశ సరిహద్దుల్లో సైనికుడిగా సేవలు అందించి, ఆ తర్వాత బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్ ద్వారా ప్రతి ఇంట్లో గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి. సాధారణ కుటుంబం నుంచి వచ్చి, ఆర్మీలో కఠినమైన శిక్షణ పొంది సరిహద్దుల్లో ఎన్నో త్యాగాలు చేసిన కళ్యాణ్, బిగ్‌బాస్ సీజన్‌లో ప్రేక్షకుల మనసులను గెలుచుకుని టైటిల్ విజేతగా నిలిచాడు
బిగ్‌బాస్ విన్నర్ కళ్యాణ్ పడాల (Kalyan Padala) ఒకప్పుడు దేశ సరిహద్దుల్లో సైనికుడిగా సేవలు అందించి, ఆ తర్వాత బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్ ద్వారా ప్రతి ఇంట్లో గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి. సాధారణ కుటుంబం నుంచి వచ్చి, ఆర్మీలో కఠినమైన శిక్షణ పొంది సరిహద్దుల్లో ఎన్నో త్యాగాలు చేసిన కళ్యాణ్, బిగ్‌బాస్ సీజన్‌లో ప్రేక్షకుల మనసులను గెలుచుకుని టైటిల్ విజేతగా నిలిచాడు. ఆ గుర్తింపుతోనే గతరాత్రి జరిగిన మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు మెగా మహోత్సవం వేడుకలకు విశిష్ట అతిథిగా హాజరై స్టేజీపైపై మాట్లాడే అవకాశం దక్కించుకున్నాడు.
వేదికపై కళ్యాణ్ పడాల మాట్లాడుతూ, గతేడాది వరకు కనీసం కింద కూర్చోవడానికి అర్హత లేని తాను ఈరోజు ఈ స్థాయిలో నిలబడటానికి మెగాస్టార్ చిరంజీవి ప్రేరణే కారణమని పేర్కొన్నాడు. చిన్నతనంలో ఎనిమిదేళ్ల వయసులో స్టాలిన్ సినిమా చూసినప్పటి నుండి చిరంజీవే తనకు దేవుడని, ఆయనను చూసే మోటివేట్ అయ్యానని చెప్పాడు. ఈ వయసులో కూడా ఆయన పడుతున్న కష్టం మనందరికీ ఇన్స్పిరేషన్ అని కొనియాడాడు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఆరా, స్క్రీన్ ప్రెజెన్స్ చూస్తే ఇప్పటికీ గూస్ బంప్స్ వస్తాయని, అలాగే తక్కువ సినిమాలు చేసినా గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన రామ్ చరణ్ విజయాలన్నింటికీ పునాది వేసింది మెగాస్టారేనని కొనియాడాడు.
అయితే, ఈ వేడుకలో ఆవేశంగా మాట్లాడుతున్న క్రమంలో కళ్యాణ్ పడాల నోటి వెంట కొన్ని పొరపాట్లు దొర్లాయి. చిరంజీవి గురించి చెబుతూ పదే పదే అతను, అతని గురించి మాట్లాడదాం అని ఏకవచనంతో సంబోధించాడు. ప్రేక్షకులు, అభిమానులు వారించినా పదే పదే అతను, బాస్ బ్రో అతను అంటూ మాట్లాడటం, అలాగే పవన్ కళ్యాణ్ కూడా అతను అని అనడం మెగా అభిమానులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. రామ్ చరణ్ రి విషయంలో రామ్ చరణ్ గారు అని గౌరవించే ప్రయత్నం చేసినప్పటికీ రామ్ చరణ్ గాడు అని సంబోధించడంతో మెగా ఫ్యాన్స్ తీవ్రంగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.
సభలో ఉన్నవారు, సోషల్ మీడియాలోని అభిమానులు కళ్యాణ్ మాట తీరుపై మండిపడుతున్నారు. మెగాస్టార్, పవర్ స్టార్ వంటి సీనియర్ అగ్ర కథానాయకులను, డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ ని కనీస గౌరవం లేకుండా అతను, ఇతను అని మాట్లాడటం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్దవారికి, సీనియర్ హీరోలకు వేదికపై ఎలా గౌరవం ఇవ్వాలో తెలియకపోతే, సరిగ్గా మాట్లాడటం రాకపోతే అసలు స్టేజ్ ఎందుకు ఎక్కావురా? అంటూ నెటిజన్లు, మెగా ఫ్యాన్స్ ఆయనపై తీవ్రస్థాయిలో కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు. ఇక మరికొందరు.. కుర్రాడు మొదటిసారి అంతా పెద్ద స్టేజ్ ఎక్కడు.. అంతమంది అభిమానుల మధ్య నిలబడడంతో భయపడి ఉంటాడు. అంతేకానీ వేరేలా అయ్యి ఉండదు.. వదిలేయండి అని చెప్పుకొస్తున్నారు. మరి ఈ ట్రోల్ వలన కళ్యాణ్ పడాల ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటాడో చూడాలి.