సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

వారానికి 4.5 లక్షలు.. బిగ్ బాస్ 10 కాస్ట్లీ కంటెస్టెంట్ ఇతడే!

ABN, Publish Date - Sep 07 , 2026 | 05:55 PM

తెలుగు బుల్లితెరపై సంచలనాలు సృష్టిస్తున్న అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు మైలురాయి లాంటి 10వ సీజన్ సెప్టెంబర్ 6 న ఎంతో ఘనంగా ప్రారంభమైంది.

Bigg Boss Telugu 10

తెలుగు బుల్లితెరపై సంచలనాలు సృష్టిస్తున్న అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు (Bigg Boss Telugu) మైలురాయి లాంటి 10వ సీజన్ సెప్టెంబర్ 6 న ఎంతో ఘనంగా ప్రారంభమైంది. గత తొమ్మిది సీజన్లుగా కేవలం టాస్కులు, గొడవలతో సాగిన ఈ గేమ్ షో, ఈసారి దశావతారం కాన్సెప్ట్‌తో సరికొత్త ఎంటర్‌టైన్‌మెంట్‌ను పరిచయం చేస్తోంది. గతం కంటే భిన్నంగా ఈ సీజన్‌లో ఆటల తీరు మారడమే కాకుండా, వినోదం, హంగామా రెట్టింపు స్థాయిలో ఉండబోతున్నాయని తొలి ఎపిసోడ్ ప్రసారమైన తీరు చూస్తేనే స్పష్టమవుతోంది.


ఈ ల్యాండ్‌మార్క్ సీజన్ కాన్సెప్ట్‌లో భాగంగా వేదికపైకి వచ్చిన కంటెస్టెంట్లు విభిన్న నేపథ్యాల నుంచి హౌస్‌లోకి అడుగుపెట్టారు. అగ్నిపరీక్ష అనే కఠినమైన సవాలును దాటుకుని ప్రత్యక్ష ఎంట్రీ సాధించిన జానపద గాయని ఝాన్సీతో పాటు, బుల్లితెరపై ఎంతో పాపులారిటీ సొంతం చేసుకున్న సీరియల్ నటీనటులు దేబ్‌జాని మోడక్, ముకేష్ గౌడ, చైత్ర రాయ్ వేదికపై సందడి చేశారు. వీరితో పాటు హీరో త్రిగుణ్, జబర్దస్త్ ఫేమ్ ఆటో రాంప్రసాద్, నరేష్, నటులు టెంపర్ వంశీ, కృష్ణుడు, పాడ్‌కాస్టర్ సుధీర్ రెడ్డిలు గ్లామర్ అండ్ ఫన్ తో హౌస్‌ను అలరించేందుకు ఎంటర్ అయ్యారు.


ఇక ఈ సీజన్‌లో పాల్గొంటున్న సెలబ్రిటీల వారపు పారితోషికాల వివరాలు సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారమవుతున్నాయి. ప్రముఖ యూట్యూబర్, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ ఆదిరెడ్డి ఈ సీజన్ కంటెస్టెంట్ రెమ్యూనరేషన్ ఇవి అంటూ చెప్పుకొచ్చాడు. ఈ సీజన్‌లోనే అత్యంత భారీ స్థాయిలో హైయెస్ట్ రెమ్యునరేషన్ అందుకుంటున్న కంటెస్టెంట్‌గా జబర్దస్త్ ఫేమ్ ఆటో రాంప్రసాద్ నిలిచాడు. ఈయనకు వారానికి సుమారు రూ. 4.5 లక్షల భారీ పారితోషికం ఇస్తున్నట్లు సమాచారం. ఆయన తర్వాత ప్రముఖ యాంకర్ కమ్ నటి వర్షిణి సౌందరరాజన్ వారానికి రూ. 3.5 లక్షలు, నటుడు ముకేష్ గౌడ రూ. 3 లక్షలు చొప్పున అందుకుంటూ టాప్ రేంజ్ రెమ్యునరేషన్ల జాబితాలో నిలిచారు.


వీరు కాకుండా త్రిగుణ్, దేబ్‌జాని మోడక్ చెరో వారానికి రూ. 2.75 లక్షలు, జబర్దస్త్ నరేష్, చైత్ర రాయ్ వారానికి రూ. 2.5 లక్షలు అందుకుంటున్నట్లు తెలిపాడు. అంతేకాకుండా టెంపర్ వంశీ, కృష్ణుడు చెరో వారానికి రూ. 2.0 లక్షలు తీసుకుంటుండగా.. సుధీర్ రెడ్డికి వారానికి రూ. 1.25 లక్షలు ముట్టజెపుతున్నట్లు తెలిపాడు. వీరితో పాటు.. హౌస్‌లోకి అడుగుపెట్టిన 6 మంది కామనర్లకు వారానికి రూ. 70,000 చొప్పున ఫిక్స్ చేసినట్లు చెప్పుకొచ్చాడు. ఇందులో నిజమెంత అనేది తెలియదు కానీ.. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన కంటెస్టెంట్ కి ఇంత పెద్ద మొత్తంలో రెమ్యూనరేషన్స్ ఉంటాయా అని నెటిజన్స్ నోళ్లు వెళ్లబెడుతున్నారు.

Updated Date - Sep 07 , 2026 | 05:56 PM