సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Bigg Boss Telugu 10: కంటెస్టెంట్లు ఫిక్స్.. మారిన టైమింగ్ ఇదే!

ABN, Publish Date - Sep 06 , 2026 | 12:09 PM

తెలుగు బుల్లితెరపై భారీ క్రేజ్ సొంతం చేసుకున్న రియాలిటీ షో ‘బిగ్ బాస్ తెలుగు’ (biggboss 10) పదో సీజన్‌కు రంగం సిద్ధమైంది.

తెలుగు బుల్లితెరపై భారీ క్రేజ్ సొంతం చేసుకున్న రియాలిటీ షో ‘బిగ్ బాస్ తెలుగు’ (biggboss 10) పదో సీజన్‌కు రంగం సిద్ధమైంది. ‘దశావతారం’ అనే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఈసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సీజన్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. కంటెస్టెంట్స్ ఎవరు? హౌస్‌లో ఎలాంటి టాస్కులు ఉండబోతున్నాయి? ఎలాంటి ట్విస్టులు ఇవ్వబోతున్నారు? అనే ఆసక్తితో అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఆదివారం రాత్రి 7 గంటలకు గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ ప్రసారం కానుంది. టెలివిజన్‌లో స్టార్ మా ఛానల్‌తో పాటు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో డిస్నీ+ హాట్‌స్టార్ ద్వారా ప్రేక్షకులు షోను వీక్షించవచ్చు.

బిగ్ బాస్ తెలుగు 10 ఫుల్ లిస్ట్

  1. దేబ్జానీ మోదక్ 

  2. త్రిగుణ్ 

  3. ఝాన్సీ

  4. సుధీర్ టాక్స్

  5. అమన్ 

  6. చైత్ర రాయ్ 

  7. ఆటో రామ్ ప్రసాద్

  8. శాలిని

  9. టెంపర్ వంశీ 

  10. శ్రష్టి 

  11. నరేష్

  12. ఆర్‌జే చరణ్ 

  13. కృష్ణుడు 

  14. వర్షిణి సౌందర్‌రాజన్ 

  15. రోహిత్ 

  16. ముఖేష్ గౌడ


ఈ సీజన్‌లో బిగ్ బాస్ టెలికాస్ట్ టైమింగ్స్‌లోనూ మార్పు కనిపించనుంది. సాధారణ రోజుల్లో ప్రసారమయ్యే ఎపిసోడ్లు సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9:30 గంటలకు ప్రారంభం కానున్నాయి. శని, ఆదివారాల్లో మాత్రం హోస్ట్ నాగార్జునతో వచ్చే వీకెండ్ స్పెషల్ ఎపిసోడ్స్ రాత్రి 9 గంటలకు టెలికాస్ట్ కానున్నాయి. దీంతో వీకెండ్ ఎపిసోడ్స్‌ను కూడా ప్రేక్షకులు కాస్త ముందుగానే చూడొచ్చు.  గత సీజన్లలో బిగ్ బాస్ డైలీ ఎపిసోడ్ రాత్రి 10 గంటల సమయంలో ప్రసారమయ్యేవి. దీంతో షో పూర్తయ్యే సమయానికి రాత్రి 11 గంటలు దాటుతుండేది. ఉద్యోగాలు, విద్యార్థులు, ఉదయం త్వరగా లేవాల్సిన కుటుంబ సభ్యులకు ఇది కొంత ఇబ్బందిగా మారేది. అయితే ఈసారి డైలీ ఎపిసోడ్స్‌ను రాత్రి 9:30 గంటలకే ప్రారంభించాలనే నిర్ణయం తీసుకోవడంతో ప్రేక్షకులకు మరింత అనుకూలంగా మారనుంది

Updated Date - Sep 06 , 2026 | 12:31 PM