Bhartha Mahasayulaku Wignyapthi Trailer: మగాళ్ల ముందు మాసే కావచ్చు.. కానీ, ఇక్కడుంది ఇద్దరు ఆడాళ్లు

ABN , Publish Date - Jan 07 , 2026 | 06:07 PM

మాస్ మహారాజా రవితేజ (Raviteja), అషికా రంగనాధన్ (Ashika Ranganthan), డింపుల్ హయాతి(Dimple Hayathi) హీరో హీరోయిన్లుగా కిషోర్ తిరుమల (Kishore Tirumala) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం భర్త మహాశయులకు విజ్ఞప్తి (Bhartha Mahasayulaku Wignyapthi).

Bhartha Mahasayulaku Wignyapthi Trailer

Bhartha Mahasayulaku Wignyapthi Trailer: మాస్ మహారాజా రవితేజ (Raviteja), అషికా రంగనాధన్ (Ashika Ranganthan), డింపుల్ హయాతి(Dimple Hayathi) హీరో హీరోయిన్లుగా కిషోర్ తిరుమల (Kishore Tirumala) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం భర్త మహాశయులకు విజ్ఞప్తి (Bhartha Mahasayulaku Wignyapthi). SLV సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో సత్య, సునీల్, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 13 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ వేగవంతం చేసిన మేకర్స్ తాజాగా భర్త మహాశయులకు విజ్ఞప్తి ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తుంది. ఇల్లాలు,. ప్రియురాలు మధ్య నలిగిపోయిన ఒక భర్త కథనే ఈ సినిమా అని తెలుస్తోంది. ఫుల్ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ అని ట్రైలర్ ని బట్టి అర్ధమవుతుంది. ప్రేమ, పెళ్లి ఏదైనా తనతోనే అనుకొనే ఒక భార్య. తనకు కరెక్ట్ పర్సన్ తన ప్రియుడే అని నమ్మే ఒక ప్రియురాలు. వీరిద్దరికి నిజం చెప్పలేక నలిగిపోయే ఒక భర్త. ఇద్దరు భామల మధ్య నిలిగే భర్త పాత్రలో రవితేజ ఒదిగిపోయాడు. అతనికి ఫ్రెండ్ గా సునీల్ కామెడీ, ఆషికా వెంటపడే అబ్బాయిగా సత్య కామెడీ సినిమాకు హైలైట్ గా నిలువున్నట్లు తెలుస్తోంది.

ఇక ట్రైలర్ మొత్తం కామెడీతో నింపేశాడు డైరెక్టర్. వింటేజ్ రవితేజ కామెడీ టైమింగ్ ని ఫ్యాన్స్ మరోసారి చూస్తారనిపిస్తుంది. ఆషికా అందాలు నెక్స్ట్ లెవెల్. భీమ్స్ మ్యూజిక్ సినిమాకు ప్రధానాకర్షణగా నిలుస్తుందని చెప్పుకొస్తున్నారు. మొత్తానికి ట్రైలర్ ని బట్టి చూస్తే ఈసారి పండగ అంటూ రవితేజ సినిమాలోనే ఉన్నట్లు ఉందని ఫ్యాన్స్ అంటున్నారు. కొన్నేళ్లుగా ప్లాప్ లతో అల్లాడుతున్న రవితేజకు ఈ సినిమా కొద్దిగా ఊరటను అందిస్తుందో లేదో చూడాలి.

Updated Date - Jan 07 , 2026 | 06:07 PM