Bhanu Chandar: రజనీకాంత్.. కింద పడేసిన సిగరెట్ పీకలు ఏరుకొని తాగేవాడు
ABN, Publish Date - Jul 06 , 2026 | 07:50 PM
సినిమా ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ లేకుండా అడుగుపెట్టి, ఒక కండక్టర్ స్థాయి నుంచి నేడు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఆరాధించే సూపర్ స్టార్‌గా ఎదిగిన రజనీకాంత్ (Rajinikanth) జీవితం ఒక నిలువెత్తు నిదర్శనం. ఆయన సాధించిన విజయం వెనుక ఉన్న కష్టాలు, కన్నీళ్లు అందరికీ తెలిసినవే.
సినిమా ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ లేకుండా అడుగుపెట్టి, ఒక కండక్టర్ స్థాయి నుంచి నేడు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఆరాధించే సూపర్ స్టార్‌గా ఎదిగిన రజనీకాంత్ (Rajinikanth) జీవితం ఒక నిలువెత్తు నిదర్శనం. ఆయన సాధించిన విజయం వెనుక ఉన్న కష్టాలు, కన్నీళ్లు అందరికీ తెలిసినవే. రజనీకాంత్ కెరీర్ తొలినాళ్లలో ఎంతటి దారుణమైన పేదరికాన్ని అనుభవించారో సీనియర్ నటుడు భానుచందర్ (Bhanu Chander) ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు. తాజాగా ఆ ఇంటర్వ్యూ క్లిప్ ఒకటి సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. అసలు ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం రజనీని చూసి నేర్చుకోవాలని.. ఆయన సూపర్ స్టార్ కాదు.. సూపర్ డూపర్ మెగాస్టార్ అంటూ భానుచందర్ రజనీపై ప్రశంసలు కురిపించాడు.
రజనీకాంత్ కెరీర్ మొదట్లో ఎక్కువగా భాను చందర్ ఇంటి బయట సిగరెట్ తాగేవాడట. ఎందుకు అనేదానికి భాను చందర్ మాట్లాడుతూ..'రజనీకాంత్ బస్ కండక్టర్ గా బెంగుళూరులో పనిచేస్తూ ఉండేవాడు. ఆ జాబ్ ని వదులుకొని చెన్నైకి వచ్చాడు. ఆయన దగ్గర డబ్బులు ఉండేవి కాదు. కష్టాలు పడి.. నలుగురు ఫ్రెండ్స్ ఉన్న రూమ్ లో నేను కూడా ఉంటాను .. అద్దె ఇచ్చుకోలేను.. మీ అందరికీ హెల్ప్ చేసి పెడతాను అని చెప్పి ఎలాగోలా వచ్చేవాడు. అతనికి సిగరెట్ అలవాటు ఎక్కువ. మా ఇన్స్టిట్యూట్ లో పెద్ద అద్దం ఉండేది. దానిముందు సిగరెట్ స్టైల్ గా తాగుతూ.. అటు ఇటు నడుస్తూ ప్రాక్టీస్ చేసేవాడు. అక్కడ ఉన్న ఆడవారందరూ ప్రిన్సిపాల్ కి ఫిర్యాదు చేసేవారు. బాత్ రూమ్ దగ్గర రజనీకాంత్ సిగరెట్ తాగుతూ అటుఇటు నడుస్తున్నాడు. మేము బాత్ రూమ్ కి వెళ్లలేకపోతున్నాం అని.. ఆయన ఏంటయ్య రజనీ.. ఇలా అయితే ఎలా.. అమ్మాయిలు ఇబ్బందిపడుతున్నారు అంటే.. సార్ సార్ వాళ్ల పని వాళ్లు చేసుకోమనండి.. నా పని నేను చేసుకుంటాను అని రజనీ చెప్పాడు.
రజనీ చాలా గ్రేట్. ఆయనకు దేవుడు ఇచ్చిన వరం అని చెప్పాలి. జీవితంలో అన్నీ చూశాడు. ఆయన ఆఫీస్ లకు ఫోన్ చేయాలంటే.. ఫోన్ లకు కూడా డబ్బులు ఉండేవి కావు. భాను.. ఒక ఫోన్ కాల అని అడిగేవాడు.. మా నాన్న ఎప్పుడు ఫోన్ కు దగ్గర ఉండే వరండాలో ఉండేవాడు. ఆయన గేట్ దగ్గర సిగరెట్ కాలుస్తున్న రజనీని చూసి .. ఎవడ్రా వాడు.. నల్లగా లావుగా ఉన్నాడు. సిగరెట్ తాగుతున్నాడు అని అడిగితే.. మన ఇన్స్టిట్యూట్ సీనియర్ స్టూడెంట్ అని చెప్పగానే.. ఏంటి ఇలాంటివాళ్ళు చదువుతున్నారా.. ? ఇక నువ్వు బాగుపడినట్లే అని తిట్టేవారు. మా నాన్న లోపలికి వెళ్ళగానే ఫోన్ చేసి కిటికిలో నుంచి ఇచ్చేవాడిని. అందుకే మా ఇంటి దగ్గర సిగరెట్ తాగేవాడు. ఇన్స్టిట్యూట్ లో సిగరెట్ పడేస్తే.. తొకొద్దు అని ఆ సిగరెట్ పీకలు ఏరుకొని కాల్చేవాడు. ఆయన జీవితాన్ని చూశాడు. అందుకే గతాన్ని మర్చిపోకుండా ఉన్నాడు. ఆయనే రియల్ మ్యాన్' అంటూ చెప్పుకొచ్చాడు.