Bhairavi: అస్సాం బ్యూటీ అందం.. అభినయం.. అమాయకత్వం..
ABN, Publish Date - Jun 08 , 2026 | 01:26 PM
గాయని సునీత (Sunitha) కుమారుడు ఆకాష్ గోపరాజు (Akash Goparaju) హీరోగా నటిస్తున్న చిత్రం ‘కొత్త మలుపు’. శివ వరప్రసాద్ కేశనకుర్తి దర్శకత్వంలో తాటి బాలకృష్ణ నిర్మించారు
గాయని సునీత (Sunitha) కుమారుడు ఆకాష్ గోపరాజు (Akash Goparaju) హీరోగా నటిస్తున్న చిత్రం ‘కొత్త మలుపు’. శివ వరప్రసాద్ కేశనకుర్తి దర్శకత్వంలో తాటి బాలకృష్ణ నిర్మించారు. ఆకాష్ సరసన భైరవి ఆర్థ్యా కథానాయికగా నటిస్తున్నారు. తెలుగులో ఆమెకిది మొదటి సినిమా. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. జూన్ 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేయడంతో సినిమాకు హైప్ క్రియేట్ అయ్యింది. తాజాగా విడుదలైన ట్రైలర్ కూడా ప్రామిసింగ్ గా ఉంది.
‘కొత్త మలుపు’ సినిమా ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి అందులో నటించిన హీరోయిన్ భైరవి ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. స్క్రీన్ పై ఆమె కనిపించిన తీరు, క్యూట్‌నెస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. కొందరైతే ఆమెను రష్మికతో పోల్చుతూ పోస్టులు పెడుతున్నారు. ఆమె నవ్వు.. రష్మిక నవ్వులా ఉందంటున్నారు నెటిజన్లు. సాధారణంగా కొత్త హీరోయిన్‌పరిచయమమైందీ అంటే ఆమె అందం గురించే యువత మాట్లాడుకుంటారు. కానీ ఈ సినిమా ట్రైలర్‌లో భైరవిని చూశాక నటన గురించి కూడా మాట్లాడుకుంటున్నారు. లంగా, వోణీ ధరించి సాంప్రదాయబద్దంగా కనిపించి మెప్పించింది. ఇందులో ఆమె కనిపించిన విధానం చేస్తే నటనకు ఆస్కారమున్న పాత్రలకు న్యాయం చేయగలదనిపిస్తుంది. దీంతో టాలీవుడ్‌కి మరో ప్రామిసింగ్ హీరోయిన్ వచ్చిందంటూ నెటిజన్లు హల్‌చల్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో కాయదు లోహర్ ఎలాగైతే టాలీవుడ్ ప్రేక్షకులకి దగ్గరైందో అస్సాం బ్యూటీ భైరవి కూడా తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు, అవకాశాలు పొందుతుందని మేకర్స్ చెబుతున్నారు.