సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Bhagyashri borse: దానవీర శూరకర్ణ డైలాగ్‌ ఇరగదీసింది..

ABN, Publish Date - Jun 21 , 2026 | 02:11 PM

భాగ్యశ్రీ బోర్సే... సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ఎప్పటికప్పుడు తన సినిమాల అప్‌డేట్స్‌ ఇస్తూ అభిమానులను అలరిస్తుంటుంది.

భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse)... సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ఎప్పటికప్పుడు తన సినిమాల అప్‌డేట్స్‌ ఇస్తూ అభిమానులను అలరిస్తుంటుంది. తాజాగా ఓ వీడియోతో అందర్నీ ఆశ్చర్యపరచింది. ప్రస్తుతం అఖిల్‌ అక్కినేని సరసన ‘లెనిన్‌’ చిత్రంలో నటిస్తోంది. జులై 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్‌ ప్రమోషన్స్‌ షురూ చేశారు. ఇందులో భాగంగా ఓ ఇంటర్వ్యూలో భాగ్యశ్రీ బోర్సే క్రేజీ వీడియో చేసింది. సీనియర్‌ ఎన్టీఆర్‌ నటించిన ‘దాన వీర శూర కర్ణ’ (Daana Veera Soora Karna) సినిమాలోని దుర్యోధనుడి పాత్రలో ఎన్టీఆర్‌ చెప్పిన ‘ఏమంటివి ఏమంటివి’ అంటూ సాగే పెద్ద డైలాగ్‌ను అలవోకగా చెప్పేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

ఆమె మాతృభాష తెలుగు కాదు. అయినా ప్రయత్నపూర్వకంగా చక్కగా డైలాగ్‌ చెప్పడంతో అభిమానులు అభినందిస్తున్నారు. డైలాగ్‌ చెబుతున్న సమయంలో కళ్లతో ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్‌ మరింత ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. ప్రేక్షకులు భాగ్యశ్రీ డైలాగ్‌ చెబుతుంటే పక్కనే ఉన్న అఖిల్‌, యాంకర్‌ సుమ కూడా ఆశ్చర్యంగా చూస్తే ఉండిపోయారు. తాజాగా ఆమె నటిస్తున్న ‘లెనిన్‌’ చిత్రం జూలై 10న విడుదల కానున్నట్లు ఈసారి నాగార్జున స్వయంగా వెల్లడించారు.

Updated Date - Jun 21 , 2026 | 03:26 PM