ఒక్క హిట్‌తో రూట్ మార్చేసిన భాగ్యశ్రీ.. నిర్మాతలకు షాక్!
ABN, Publish Date - Jul 18 , 2026 | 09:25 PM
సినిమా ఇండస్ట్రీలో టాలెంట్ ఒక్కటే ఉంటే సరిపోదు, బాక్సాఫీస్ వద్ద విజయం అనే అదృష్టం కూడా కలిసిరావాలి. కొందరికి మొదటి అడుగుతోనే స్టార్‌డమ్ దక్కితే, మరికొందరు ఆ ఒక్క మలుపు కోసం నిరంతరం శ్రమించాల్సి వస్తుంది.
సినిమా ఇండస్ట్రీలో టాలెంట్ ఒక్కటే ఉంటే సరిపోదు, బాక్సాఫీస్ వద్ద విజయం అనే అదృష్టం కూడా కలిసిరావాలి. కొందరికి మొదటి అడుగుతోనే స్టార్‌డమ్ దక్కితే, మరికొందరు ఆ ఒక్క మలుపు కోసం నిరంతరం శ్రమించాల్సి వస్తుంది. గ్లామరస్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) సినీ ప్రయాణం కూడా ఇలాంటి ఆసక్తికరమైన మలుపులతోనే సాగింది. గ్లామర్, యాక్టింగ్ పరంగా ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించినప్పటికీ, కెరీర్ ఆరంభంలో ఒక సరైన కమర్షియల్ సక్సెస్ కోసం ఈ భామ గట్టిగానే ఎదురుచూడాల్సి వచ్చింది.
మాస్ మహారాజా రవితేజ సరసన ‘మిస్టర్ బచ్చన్’ (Mr Bachchan) సినిమాతో టాలీవుడ్‌లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది భాగ్యశ్రీ. వెండితెరపై ఆమె లుక్స్, అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఆ సినిమా ఆశించిన స్థాయి ఫలితాన్ని అందుకోలేకపోయినా, ఈ బ్యూటీకి మాత్రం టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ‘కింగ్‌డమ్, కాంతా, ఆంధ్ర కింగ్ తాలూకా’ వంటి ప్రాజెక్టులు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడినప్పటికీ, ఆమె క్రేజ్ మాత్రం తగ్గలేదు. సాధారణంగా పరాజయాలు ఎదురైతే హీరోయిన్ల కెరీర్ నెమ్మదిస్తుంది, కానీ భాగ్యశ్రీ విషయంలో టాలెంట్ పై నమ్మకంతో దర్శక నిర్మాతలు వరుసగా అవకాశాలు ఇస్తూనే వచ్చారు. సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా తెరపై భాగ్యశ్రీ చూపించే నటన, ఆమె కనబరిచిన ఇంప్రూవ్ మెంట్ ఇండస్ట్రీలో ఆమెపై నమ్మకాన్ని పెంచాయి. ఈ క్రమంలోనే ఇటీవల వచ్చిన ‘లెనిన్’ (Lenin) చిత్రం ఆమె కెరీర్‌ను పూర్తిగా మార్చేసింది. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న భారీ విజయాన్ని ఈ సినిమా భాగ్యశ్రీకి అందించింది. ఈ చిత్రంలో ఆమె నటనకు, పండించిన హావభావాలకు థియేటర్లలోనే కాకుండా సోషల్ మీడియాలోనూ విపరీతమైన ప్రశంసలు దక్కాయి. కేవలం గ్లామర్ డాల్ గానే కాకుండా, బలమైన పాత్రలను సైతం అలవోకగా పండించగలనని ఈ సక్సెస్‌తో ఆమె నిరూపించుకుంది.
ఈ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన జోష్‌తో భాగ్యశ్రీ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది. యంగ్ హీరోలు, క్రేజీ ప్రాజెక్టుల మేకర్స్ ఇప్పుడు ఈమె వైపే చూస్తున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్‌లో బిజీగా ఉంటూనే, శివకార్తికేయన్ సరసన ‘సేయోన్’ చిత్రంతో కోలీవుడ్‌లోకి కూడా అడుగుపెడుతూ తన మార్కెట్‌ను విస్తరించుకుంటోంది. ఈ సక్సెస్ ట్రాక్‌తో భాగ్యశ్రీ తన రెమ్యునరేషన్‌ను ఏకంగా డబుల్ చేసినట్లు టాక్ నడుస్తోంది. గతంలో ఒక్కో సినిమాకు రూ.1.50 కోట్లు అందుకున్న ఈ భామ, ‘లెనిన్’ హిట్ తర్వాత ఇప్పుడు ఏకంగా రూ.3 కోట్ల రేంజ్‌లో డిమాండ్ చేస్తోందట. ఈ వరుస ప్రాజెక్టులు, కొత్త సక్సెస్ జోష్ ఆమెను స్టార్ హీరోయిన్ల లీగ్‌లో ఏ స్థానంలో నిలబెడతాయో చూడాలి. ఇదిలా ఉంటే, భాగ్యశ్రీ ఈ స్టెప్‌తో నిర్మాతలు షాక్ ఇచ్చిందనేలా వార్తలు మొదలయ్యాయి. ఒక్క హిట్‌కే డబుల్ చేస్తే.. ఇంకో హిట్ పడితే ఈ భామ ఇంకెలాంటి స్టెప్ తీసుకుంటుందో.. అసలు భూమి మీద నిలబడుతుందా? అనేలా కొందరు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
72th National Awards: 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల విజేతలు వీరే..
విక్రమ్-1 రాకెట్ విజయంపై మెగాస్టార్ చిరంజీవి పోస్ట్ వైరల్..
RC17 Update: చరణ్, సుక్కు సినిమా మొదలయ్యేది అప్పుడేనా..