సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Lenin: అయ్యగారు పక్కన భాగ్యశ్రీ.. శ్రీలీల కంటే బావుందా

ABN, Publish Date - Jan 02 , 2026 | 09:57 PM

ఎట్టకేలకు కొత్త ఏడాది అఖిల్ అక్కినేని (Akhil Akkineni) లెనిన్ (Lenin) నుంచి ఒక అప్డేట్ ఇచ్చాడు. ఏజెంట్ లాంటి డిజాస్టర్ తరువాత అఖిల్ నుంచి వస్తున్న చిత్రం లెనిన్.

Lenin

Lenin: ఎట్టకేలకు కొత్త ఏడాది అఖిల్ అక్కినేని (Akhil Akkineni) లెనిన్ (Lenin) నుంచి ఒక అప్డేట్ ఇచ్చాడు. ఏజెంట్ లాంటి డిజాస్టర్ తరువాత అఖిల్ నుంచి వస్తున్న చిత్రం లెనిన్. ఇక ఈ సినిమాకు మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నాడు, ఇక ఈ సినిమాను సితార ఎంటర్ టైన్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ, అక్కినేని నాగార్జున నిర్మిస్తున్నారు. మొదట ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా ఎంపిక అయ్యింది. అయ్యగారి పక్కన శ్రీలీల (Sreeleela) ఉన్న ఫోటోను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. అయితే ఆ తరువాత ఏమైందో ఏమో తెలియదు కానీ.. శ్రీలీల ఈ సినిమా నుంచి తప్పుకుంది.

ఇక శ్రీలీల ప్లేస్ ని భాగ్యశ్రీ బోర్సే రీప్లేస్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి కానీ, మేకర్స్ మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. ఆ తరువాత అఖిల్ పెళ్లి పనులు ఇలా సగం సమయం అటే పోయింది. సరే పెళ్లి తరువాత అఖిల్ షూటింగ్ లో అడుగుపెట్టాడు అంటే మధ్యలో కొన్ని అడ్డంకులు వలన రీషూట్ చేశారని టాక్. ఒకానొక దశలో అసలు లెనిన్ సినిమా ఉందా.. లేదా అనే అనుమానం కూడా వచ్చింది.

అనుమానాలు, అడ్డంకులు దాటుకొని కొత్త ఏడాది అయ్యగారు లెనిన్ షూటింగ్ పూర్తిచేసే పనిలో పడ్డట్లు ఒక అప్డేట్ ఇచ్చారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ అఖిల్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. జనవరి 5 న లెనిన్ నుంచి మొదటి సాంగ్ ను రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. ఇక తాజాగా భాగ్యశ్రీ పోస్టర్ ని మేకర్స్ అధికారికంగా రిలీజ్ చేశారు. ఇందులో భారతీ అనే పాత్రలో భాగ్యశ్రీ నటించనున్నట్లు తెలుపుతూ అమ్మడి లుక్ ని రివీల్ చేశారు. లంగావోణీలో చిన్నది తన అందంతో చితక్కొట్టేస్తుంది. వారేవా.. వావ్వా .. ఎన్నెలల్లే ఉంటది మా భారతి అంటూ సాగే సాంగ్ ని జనవరి 5 న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఇక ఈ పోస్టర్ చూసాక.. అయ్యగారి పక్కన శ్రీలీలనే బావుందని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. అఖిల్ పక్కన భాగ్యశ్రీ పెద్దగా కనిపిస్తుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరి ఫస్ట్ సాంగ్ వచ్చాక వీరి జోడీపై ఎలాంటి కామెంట్స్ వస్తాయో చూడాలి.

Updated Date - Jan 02 , 2026 | 09:57 PM