రామాయణ Vs వారణాసి మధ్యలో కల్కి 2

ABN , Publish Date - Apr 08 , 2026 | 09:23 AM

మైథలాజికల్ టచ్ ఉన్న మూడు బిగ్ ప్రాజెక్ట్స్ చుట్టూ ఆల్ ఇండియా మూవీ ఫ్యాన్స్ చూపు సాగుతోంది. ఆ సినిమాల డిజిటల్ రైట్స్ పై అప్పుడే చర్చ మొదలయింది. ఇంతకూ ఆ మూడు సినిమాలేవో?.

Ramayana Varanasi Kalki2

ఈ మధ్యే రణబీర్ కపూర్ (Ranbir Kapoor), సాయిపల్లవి (Sai Pallavi) నటించిన రామాయణ (Ramayana) మూవీ ఫస్ట్ గ్లింప్స్ రిలీజయింది. నితేశ్ తివారీ (Nitesh Tiwari) దర్శకత్వంలో నమిత్ మల్హోత్ర (Namith Malhothra) నిర్మిస్తోన్న రామాయణ (Ramayana) రెండు భాగాలుగా రిలీజ్ కానుంది. మొదటి భాగం ఈ యేడాది దీపావళి కానుకగా జనం ముందు నిలవనుంది. ఈ చిత్రం ఓటీటీ రైట్స్ కోసం ఓ ప్రముఖ సంస్థ 700 కోట్ల రూపాయలు ఆఫర్ చేసినట్టు సమాచారం. అయితే చిత్ర నిర్మాత నితేశ్ తివారీ వెయ్యి కోట్లు డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. అదీగాక 'రామాయణ' రెండు భాగాల్లో ఒక్కో సినిమా ఓటీటీ రైట్స్ వేర్వేరుగా అమ్మే యోచనతోనూ నితేశ్ ఉన్నట్టు వినికిడి.

ఇదే తీరున మహేశ్ బాబు (Mahesh Babu) హీరోగా రాజమౌళి (S. S. Rajamouli) డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న వారణాసి (Varanasi) ఓటీటీ రైట్స్ కోసం నెట్ ఫ్లిక్స్ సంస్థ 700 కోట్ల రూపాయలు ఆఫర్ చేసినట్టు సమాచారం. 'వారణాసి' మేకర్స్ సైతం దానిని తోసిరాజని వెయ్యి కోట్లు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) తెరకెక్కిస్తోన్న కల్కి పార్ట్ 2 (Kalki 2) ఓటీటీ రైట్స్ కూడా ఇదే రేంజ్‌లో ఉంటాయని అంటున్నారు. అలా ఓ పౌరాణిక చిత్రం, పురాణగాథల నేపథ్యంలో తెరకెక్కుతోన్న రెండు సినిమాలు కూడా ఓటీటీ ఎరీనాలో తమదైన బాణీ పలికిస్తున్నాయని ట్రేడ్ పండిట్స్ అంటున్నారు.

'రామాయణ' మూవీ ఫస్ట్ గ్లింప్స్ విడుదలైనా, ఎందువల్లో సరైన రీతిలో అలరించడం లేదని ఓ టాక్ సాగుతోంది. ఈ గ్లింప్స్ చూసి చాలామంది పెదవి విరుస్తున్నారు. వీటి కంటే అంతకు ముందు 'ఏఐ'తో రూపొందించిన ఫ్యాన్ మేడ్ ఐటమ్స్ బెటర్ గా ఉన్నాయనీ అంటున్నారు. 'రామాయణ' రెండు భాగాల బడ్జెట్ నాలుగు వేల కోట్ల రూపాయలని వినిపిస్తోంది. అందువల్ల ఈ మూవీ ఒక్కో భాగం ఓటీటీ రైట్స్ వెయ్యి కోట్లకు పైగా నిర్మాత నితేశ్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

ఇక రాజమౌళి 'వారణాసి' మూవీ ఒక్క భాగంగానే రానుంది. ఈ సినిమా నిర్మాణవ్యయం దాదాపు రెండు వేల కోట్లు ఉంటుందని అంచనా!. ఈ నేపథ్యంలోనే 'వారణాసి' మేకర్స్ సైతం ఓటీటీ రైట్స్ ను వెయ్యి కోట్లకు నిర్ణయించినట్టు సమాచారం. 'కల్కి-2' షూటింగ్ సాగుతోంది. ఇందులో ప్రభాస్ సీన్స్‌కు సంబంధించినవి తరువాత చిత్రీకరించే ప్రణాళికతో అందుబాటులో ఉన్న తారలతో లాగించేస్తున్నారు. 'కల్కి' మొదటి భాగం సాధించిన ఘనవిజయాన్ని దృష్టిలో పెట్టుకొని సెకండ్ పార్ట్‌ను కూడా భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. అందువల్లే నాగ్ అశ్విన్ సైతం తన 'కల్కి -2' ఓటీటీ రైట్స్ ను వెయ్యి కోట్లు చెబుతున్నారనీ టముకు సాగుతోంది. దీనిని బట్టే నాగ్ అశ్విన్‌కు తన ప్రాజెక్ట్ పై ఎంతటి నమ్మకం ఉందో అర్థమవుతోందనీ పరిశీలకులు అంటున్నారు...

ఓ వైపు పౌరాణిక చిత్రం 'రామాయణ', మరోవైపు పురాణాల నేపథ్యంలో 'వారణాసి', 'కల్కి' చిత్రాలు సినీ ఫ్యాన్స్‌ను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. 'రామాయణ' మొదటి భాగం ఈ ఏడాది నవంబర్ 8న వెలుగు చూడనుంది. ఇక 'వారణాసి' చిత్రం వచ్చే సంవత్సరం ఉగాది కానుకగా ఏప్రిల్ 7న విడుదల కానుంది. 'కల్కి -2' మాత్రం వచ్చే యేడాదిలో కానీ, 2028 జనవరిలో కానీ రిలీజవుతుందని తెలుస్తోంది. ఇలా ఈ మూడు చిత్రాలపై సినీ ఫ్యాన్స్ దృష్టి సారిస్తున్నా, నిస్సందేహంగా రాజమౌళి 'వారణాసి'కే ఎక్కువ క్రేజ్ ఉన్నట్టు పరిశీలకులు భావిస్తున్నారు. మరి 'రామాయణ' రెండు భాగాలు, 'కల్కి రెండో భాగం' సినిమాలు ఏ స్థాయిలో బాక్సాఫీస్ ను షేక్ చేస్తాయో తెలియదు కానీ, 'వారణాసి' తప్పకుండా ప్రపంచ వ్యాప్తంగా ఊపేస్తుందని అంటున్నారు. ఏమవుతుందో చూడాలి.

Updated Date - Apr 08 , 2026 | 10:24 AM