సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

మిస్సమ్మ మూడోసారి.. ‘మోడ్రన్‌ మిస్సమ్మ’ ఫస్ట్ సింగిల్ విడుదల

ABN, Publish Date - Aug 20 , 2026 | 07:03 AM

హర్ష నర్రా, తన్మయి ఖుషీ ప్రధాన పాత్రల్లో నటించిన ‘మోడ్రన్‌ మిస్సమ్మ’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘బెటర్ బీ ఏ మిస్సమ్మ’ విడుదలైంది.

Modern Missamma

హర్ష నర్రా (Harsha Narra), తన్మయి ఖుషీ (Tanmayi Khushi), సిజు ఏఆర్‌, ప్రమోదిని ప్రధాన పాత్రధారులుగా సాయిబాబా తెరకెక్కిస్తున్న చిత్రం ‘మోడ్రన్‌ మిస్సమ్మ’ (Modern Missamma) చిరంజీవి పమిడి, శివ పమిడి, కిరణ్‌కుమార్‌ నల్లూరి, స్రవంతి నంబూరి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్‌ సింగిల్‌ ‘బెటర్‌ బీ ఏ మిస్సమ్మ’ పాటను విడుదల చేశారు. కిట్టూ విస్సా ప్ర‌గ‌డ సాహిత్యం అందించ‌గా గోపీ సుంద‌ర్ సంగీతంలో సాహితీ చాగంటి, భ‌వాని కాకేవ్ ఆల‌పించారు. పెళ్లి దాని నుంచి వ‌చ్చే ప‌ర్య‌వ‌స‌నాల గురించి క‌థానాయిక వ‌ర్ణిస్తూ ఈ పాట సాగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నిర్మాత కిశోర్‌ నాయుడు మాట్లాడుతూ ‘ప్రేక్షకులను మెప్పించే అన్ని అంశాలున్న ఈ సినిమా కచ్చితంగా ఘనవిజయం సాధిస్తుంది’ అని తెలిపారు. హర్ష నర్రా మాట్లాడుతూ ‘ఇప్పటి ట్రెండ్‌కు తగ్గట్లు ఉన్న ఈ చిత్రంలోని కంటెంట్‌ అందరికీ కనెక్ట్‌ అవుతుంది’ అని చెప్పారు. ‘ఇప్పటివరకూ వచ్చిన ఎన్టీఆర్‌ ‘మిస్సమ్మ’, భూమిక ‘మిస్సమ్మ’ లాగే మా ‘మోడ్రన్‌ మిస్సమ్మ’ కూడా అందరికీ కనెక్ట్‌ అవుతుందనే నమ్మకం ఉంది’ అని సాయిబాబా తెలిపారు.

Updated Date - Aug 20 , 2026 | 07:03 AM