బెల్లంకొండ సాయి శ్రీనివాస్: ముహూర్తం కుదిరింది.. సింపుల్‌గా పెళ్లి..
ABN, Publish Date - Mar 27 , 2026 | 06:40 PM
టాలీవుడ్‌లో మరో హీరో పెళ్లి పీటలెక్కనున్నారు. నిర్మాత బెల్లంకొండ సురేశ్ కుమారుడు సాయి శ్రీనివాస్ త్వరలోనే ఓ ఇంటివాడు కానున్నాడు.
టాలీవుడ్‌లో మరో హీరో పెళ్లి పీటలెక్కనున్నారు. నిర్మాత బెల్లంకొండ సురేశ్ కుమారుడు సాయి శ్రీనివాస్ (bellamkonda sai srinivas) త్వరలోనే ఓ ఇంటివాడు కానున్నాడు. ప్రియురాలు కావ్యారెడ్డితో (Kavya reddy) ఆయన ఏడడుగులు వేయనున్నారు. ఇటీవల కాబోయే వధూవరులను పరిచయం చేస్తూ హైదరాబాద్‌లో ఓ కార్యక్రమం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అయినట్లు తెలిసింది. ఏప్రిల్ 5న కావ్యారెడ్డితో సాయి శ్రీనివాస్ నిశ్చితార్థం జరగబోతోంది. ఏప్రిల్ 29న తిరుపతిలో నిరాడంబరంగా పెళ్లి చేసుకోబోతున్నారని తెలిసింది. మే 1న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్ ఏర్పాటు చేయడానికి ఇరు కుటుంబాలు నిర్ణయం తీసుకున్నారట.
సాయి శ్రీనివాస్ కొంతకాలంగా కావ్యారెడ్డితో ప్రేమలో ఉన్నారు. ఇరు కుటుంబాలు పెళ్లికి అంగీకరించడంతో ముహూర్తాలు పెట్టేశారు. ఏప్రిల్ 5న హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో జరిగే నిశ్చితార్థ వేడుకకు తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నారు.