అల్లుడు శీను ఎంగేజ్‌మెంట్.. బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్‌బై..
ABN, Publish Date - Mar 08 , 2026 | 03:56 PM
నిర్మాత బెల్లంకొండ సురేష్ ఇంట్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆయన పెద్ద కుమారుడు, హీరో బెల్లంకొండ శ్రీనివాస్ (Bellamkonda Sai srinivas) బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పనున్నారు.
నిర్మాత బెల్లంకొండ సురేష్ ఇంట్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి.
ఆయన పెద్ద కుమారుడు, హీరో బెల్లంకొండ శ్రీనివాస్ (Bellamkonda Sai srinivas) బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పనున్నారు. కావ్య రెడ్డితో (Kavya) ఆయన నిశ్చితార్థం ఆదివారం గ్రాండ్ గా జరిగింది. కుటుంబ సభ్యులు, అతి కొద్ది మంది స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బోయపాటి శ్రీను, హీరోయిన్ సంయుక్త మీనన్ కాబోయే జంటకు విష్ చేస్తున్న వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. హైదరాబాద్ కు చెందిన కావ్యతో కొన్నాళ్లుగా బెల్లంకొండ శ్రీనివాస్ ప్రేమలో ఉన్నారని, ఇరు కుటుంబాలు అంగీకరించి పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఈ ఏడాది చివరిలో పెళ్లి జరగనుందని తెలుస్తోంది.
‘అల్లుడు శీను’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు బెల్లంకొండ శ్రీనివాస్. స్పీడున్నోడు, జయ జానకీ నాయక, సాక్ష్యం, కవచం, సీత, రాక్షసుడు, అల్లుడు అదుర్స్, ఛత్రపతి (హిందీ రీమేక్), భైరవం, కిష్కింధ పురి చిత్రాల్లో నటించి తన నటనతో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఆయన 'టైసన్ నాయుడు, హైందవ' చిత్రాల్లో నటిస్తున్నారు.