ENE Repeat: బతుకమ్మ.. ఈ కన్నె ముచ్చట వినమ్మా
ABN, Publish Date - Nov 12 , 2026 | 09:23 PM
టాలీవుడ్ అభిమానులు మొత్తం ఎంతగానో ఎదురుచూస్తోన్న సీక్వెల్ ఈ నగరానికి ఏమైంది రీపీట్ (ENE Repeat). యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మొదటిపార్ట్ లో నటించిన విశ్వక్ సేన్, అభినవ్ గోమటం, వెంకటేష్ కాకమాను సీక్వెల్ లో నటించారు.
టాలీవుడ్ అభిమానులు మొత్తం ఎంతగానో ఎదురుచూస్తోన్న సీక్వెల్ ఈ నగరానికి ఏమైంది రీపీట్ (ENE Repeat). యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మొదటిపార్ట్ లో నటించిన విశ్వక్ సేన్, అభినవ్ గోమటం, వెంకటేష్ కాకమాను సీక్వెల్ లో నటించారు. వీరితో పాటు కొత్తగా శ్రీనాథ్ మాగంటి, శివాత్మిక రాజశేఖర్ యాడ్ అయ్యారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి మరో లిరికల్ వీడియోని మేకర్స్ రిలీజ్ చేశారు.
బతుకమ్మ అంటూ సాగే ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల వైభవాన్ని కళ్లకు కట్టేలా ఈ పాటను అత్యంత రంగులమయంగా, ఉత్సాహభరితంగా తీర్చిదిద్దారు. ప్రతి ఆడపిల్ల తనకు కాబోయే భర్తని తలుచుకొని బతుకమ్మని ఎత్తుతుంది. ఈ సాంగ్ లో కూడా అదే చూపించారు. బతుకమ్మకి ఒక కన్నె పడుచు.. తన మనసులో ఉన్న కుర్రాడి గురించి, అతడు ఎలా ఉండాలో చెప్పుకుంటూ ఉంటుంది. ప్రముఖ సంగీత దర్శకుడు వివేక్ సాగర్ మ్యూజిక్, చంద్రబోస్ లిరిక్స్ ఒక ఎత్తు అయితే స్టార్ సింగర్ శ్రేయా ఘోషల్ ఈ బతుకమ్మ పాటను ఎంతో ఎనర్జిటిక్‌గా ఆలపించి మరో స్థాయికి తీసుకెళ్లింది.
ఇక అచ్చ తెలుగు అందం శివాత్మిక రాజశేఖర్ తన అందంతో అందరినీ మంత్రముగ్ధులను చేసింది. లంగావోణిలో బతుకమ్మ పెడుతూ ఉంటే వీనుల విందుగా కనిపించింది. బతుకమ్మ సాంగ్ ని కొంచెం లేట్ గా వదిలారు కానీ, ఇదే సాంగ్ ని బతుకమ్మ పండగ రోజున వదిలి ఉంటే.. సోషల్ మీడియా మొత్తం రీల్స్ తో అమ్మాయిలు పిచ్చెక్కించేవారు. ఇక ఈ సాంగ్ తో సినిమాపై హైప్ పెరిగిపోయింది. ఇప్పటికే ఈ చిత్రం కోసం తెలుగు యువత మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. నవంబర్ 19 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే టీమ్ కన్యారాశి చేసిన రచ్చ ఇంకా కొనసాగుతున్న నేపధ్యంలో ఈ సీక్వెల్ మరింత వినోదాన్ని ఇస్తుందా.. లేదా అనేది తెలియాల్సి ఉంది.