సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Prabhakar: క్ష‌మించండి.. నా ఫ్యామిలీని తిట్ట‌కండి! మా అబ్బాయిని పద్దతిగానే పెంచాను

ABN, Publish Date - Feb 07 , 2026 | 08:59 PM

న‌టుడు ప్ర‌భాక‌ర్ కుమారుడు చంద్ర‌హాస్ హీరోగా రూపొంది, ఈ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ఎదుట‌కు వ‌చ్చిన చిత్రం బ‌రాబ‌ర్ ప్రేమిస్తా.

Prabhakar

టీవీ న‌టుడు ప్ర‌భాక‌ర్ (Prabhakar) కుమారుడు చంద్ర‌హాస్ (Chandrahass) హీరోగా రూపొంది ఈ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ఎదుట‌కు వ‌చ్చిన చిత్రం బ‌రాబ‌ర్ ప్రేమిస్తా (Barabar Premistha). అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సంద‌ర్భంగా చంద్ర‌హాస్ అత్యుత్సాహంతో సినిమాలోని పాట‌కు సొంత ప‌ద‌జాలం ఉప‌యోగించి బూతుల‌తో పాట‌ పాడి అక్క‌డికి వ‌చ్చిన వారిని, టీవీ ఎదుట చూస్తున్న వారిని షాక్ కు గురి చేశాడు. ఆపై.. అది కాస్త వైర‌ల్‌గా మారి పెద్ద ర‌చ్చే జ‌రుగ‌గా తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఓ మీడియా ప్ర‌తినిధి స‌ద‌రు పాట‌పై తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తూ పాట పాడిన వారు త‌ప్ప‌క క్ష‌మాప‌ణ చెప్పాల్సిందే అని ఆగ్ర‌హం కూడా వ్య‌క్తం చేశాడు. అది ఇప్పుడు సోష‌ల్‌మీడియాలో పెద్ద చ‌ర్చ‌కే దారి తీస్తోంది.

అంతేగాక‌.. ఈ క్ర‌మంలో అనేక మంది చంద్ర‌హాస్ పెరిగిన విధానం, పెంప‌కం గురించి కూడా విమ‌ర్శ‌లు చేశారు. ఈ నేప‌థ్యంలో తాజాగా శ‌నివారం ప్ర‌భాక‌ర్ తెర ముందుకు వ‌చ్చి అంద‌రికీ క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. 'మా అబ్బాయి తప్పు చేశాడు.. నేను అతనికి ఆ విషయం చెప్పాను. కానీ అతని తప్పును ఎత్తి చూపే క్రమంలో కొందరు తప్పులు చేశారు.. నా ఫ్యామిలీ గురించి బ్యాడ్‌గా మాట్లాడారు. మా అబ్బాయిని నేను పద్ధతిగానే పెంచాను. అతను మాట్లాడిన ఓ బూతు పదంతో అంచనాలకు రాకూడద‌ని కోరుతున్నాను' అని అన్నారు.

'నేను పిలవగానే ఆ రోజు ఈవెంట్‌కు జేడీ చ‌క్ర‌వ‌ర్తి, ద‌ర్శ‌కుడు జయంత్ గెస్టులుగా వచ్చారు.. నా వల్ల మాటలు పడాల్సి వచ్చిన జేడీ చక్రవర్తి, జయంత్ సి పరాన్జీకి క్షమాపణలు తెలుపుతున్నాను' అని ప్రభాకర్ చెప్పారు. ప్ర‌స్తుతం సినిమా థియేట‌ర్ల‌లో ఉంద‌ని.. తన కుమారుడు చంద్ర‌హాస్ న‌ట‌నను అందరూ మెచ్చుకుంటున్నార‌ని ప్రభాకర్ ఎమోష‌న‌ల్ అయ్యారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్‌ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది.

Updated Date - Feb 07 , 2026 | 10:57 PM