Barabar premistha: అమ్మాయి.. అబ్బాయి కొట్లాడుకుంటే..
ABN, Publish Date - Jan 24 , 2026 | 07:52 PM
చంద్రహాస్ హీరోగా వస్తున్న కొత్త చిత్రం ‘బరాబర్ ప్రేమిస్తా’. సంపత్ రుద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను కాకర్ల సత్యనారాయణ సమర్పణలో రూపొందుతోంది
చంద్రహాస్ హీరోగా వస్తున్న కొత్త చిత్రం ‘బరాబర్ ప్రేమిస్తా’. సంపత్ రుద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను కాకర్ల సత్యనారాయణ సమర్పణలో సిసి క్రియేషన్స్, ఎవిఆర్ మూవీ వండర్స్ బ్యానర్లపై గెడా చందు, గాయత్రి చిన్ని, ఎవిఆర్ నిర్మిస్తున్నారు. మిస్ ఇండియా ఫైనలిస్ట్ మేఘన ముఖర్జీ హీరోయిన్‌గా నటించారు. హైదరాబాద్‌లోని బ్రిలియంట్ గ్రూప్ ఆఫ్ కాలేజీస్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. ఫిబ్రవరి 6న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాతో భారీ విజయం అందుకోబోతున్నామని హీరో చంద్రహాస్ నమ్మకం వ్యక్తం చేశారు.
దర్శకుడు సంపత్ రుద్ర మాట్లాడుతూ ‘ఒక ఊరిలో ఒక అమ్మాయి, ఒక అబ్బాయి కొట్టుకుంటే ఎలా ఉంటుంది అనేదే మా బారాబర్ ప్రేమిస్తా సినిమా. పక్కా తెలంగాణ బ్యాక్ ఓవర్‌లో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగే సినిమా ఇది’ అని అన్నారు.