సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

పెద్దికి సపోర్ట్ గా బండ్లన్న

ABN, Publish Date - May 23 , 2026 | 09:44 PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), స్టార్ డైరెక్టర్ బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో వస్తున్న భారీ పీరియాడిక్ విలేజ్ యాక్షన్ డ్రామా పెద్ది (Peddi). జాన్వీ కపూర్ కథానాయికగా, ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంపై టాలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి.

Bandla Ganesh

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), స్టార్ డైరెక్టర్ బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో వస్తున్న భారీ పీరియాడిక్ విలేజ్ యాక్షన్ డ్రామా పెద్ది (Peddi). జాన్వీ కపూర్ కథానాయికగా, ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంపై టాలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. జూన్ 4 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ స్పీడును పెంచేశారు.


అయితే ఎలాంటి ఆటంకాలు లేకుండా పెద్ది రిలీజ్ అవుతోంది అనుకొనేలోపు పెద్ద సమస్య వచ్చి పడింది. ఎగ్జిబిటర్లు అందరూ ఇకనుంచి ప్రతి సినిమాకు పర్సెంటేజ్ సిస్టమ్ తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది పెద్ది సినిమాతోనే మొదలుకావాలని వారు పట్టుబడుతున్నారు. దీనిపై ఇండస్ట్రీకి సంబంధించిన హీరోలు కానీ, డైరెక్టర్స్ కానీ నోరు విప్పలేదు. కానీ, మొట్టమొదటిసారి పెద్ది విషయంలో ఇండస్ట్రీ మొత్తం ఏకం కావాలని బండ్ల గణేష్ పిలుపునిచ్చాడు. రాజకీయాలు, విభేదాలు, వ్యక్తిగత అభిప్రాయాలు కొంతకాలం పక్కన పెట్టి ఇండస్ట్రీ భవిష్యత్తు కోసం కలిసి ముందుకు రావాలని ఆయన సోషల్ మీడియా ద్వారా తెలిపాడు.


సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు కష్టకాలంలో ఉంది. ఈ సమయంలో మనందరికీ ఒక పెద్ద బ్లాక్‌బస్టర్ సినిమా అవసరం. తెలుగు సినిమా గౌరవం, థియేటర్ల భవిష్యత్తు, వేలాది కుటుంబాల జీవితం సినిమా మీదే ఆధారపడి ఉన్నాయి. ఇటీవల ఇండస్ట్రీలో బాక్సాఫీస్ పరిస్థితులు, థియేటర్ సమస్యలు, విడుదలల ఒత్తిడిపై కూడా చర్చలు జరుగుతున్నాయి. అందుకే నా వినమ్ర విజ్ఞప్తి… “పెద్ది” సినిమా రిలీజ్ విషయంలో పెద్ద మనసుతో అందరూ ఒక్కటిగా నిలబడాలి. రాజకీయాలు, విభేదాలు, వ్యక్తిగత అభిప్రాయాలు కొంతకాలం పక్కన పెట్టి ఇండస్ట్రీ భవిష్యత్తు కోసం కలిసి ముందుకు రావాలి.

ఒక మంచి సినిమా బ్లాక్‌బస్టర్ అయితే నిర్మాతలకి, డిస్ట్రిబ్యూటర్లకి, ఎగ్జిబిటర్లకి, కార్మికులకి మళ్లీ నమ్మకం వస్తుంది. దయచేసి పెద్దలందరూ సామరస్యంగా మాట్లాడుకుని సమస్యలను పరిష్కరించండి. “పెద్ది” సినిమా రిలీజ్ వరకు అయినా ఎవ్వరూ వివాదాలు, అనవసర వ్యాఖ్యలు, రాజకీయ అంశాలు తీసుకురాకుండా సహకరించాలి అని నా హృదయపూర్వక విన్నపం. సినిమా బాగుంటే ఇండస్ట్రీ బాగుంటుంది… ఇండస్ట్రీ బాగుంటే వేల కుటుంబాలు బాగుంటాయని తెలిపాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

Updated Date - May 23 , 2026 | 09:54 PM