సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

అప్పుడు తిట్టాడు.. ఇప్పుడు కౌగిలించుకున్నాడు

ABN, Publish Date - Jun 21 , 2026 | 05:10 PM

ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరం చెప్పలేం. ఒకసారి బద్ద శత్రువులు అంటారు. ఇంకోసారి బెస్ట్ ఫ్రెండ్స్ అంటారు. కొన్నిసార్లు తిడతారు.. ఇంకొన్నిసార్లు ప్రశంసలతో ముంచెత్తుతారు. ఇప్పుడు ఎందుకు ఇదంతా అంటే.. బద్ద శత్రువులు అనుకున్న ఇద్దరు సడెన్ గా బెస్ట్ ఫ్రెండ్స్ గా కలిసి కనిపించారు.

Bandla Ganesh

ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరం చెప్పలేం. ఒకసారి బద్ద శత్రువులు అంటారు. ఇంకోసారి బెస్ట్ ఫ్రెండ్స్ అంటారు. కొన్నిసార్లు తిడతారు.. ఇంకొన్నిసార్లు ప్రశంసలతో ముంచెత్తుతారు. ఇప్పుడు ఎందుకు ఇదంతా అంటే.. బద్ద శత్రువులు అనుకున్న ఇద్దరు సడెన్ గా బెస్ట్ ఫ్రెండ్స్ గా కలిసి కనిపించారు. వారెవరు అంటే బండ్ల గణేష్ (Bandla Ganesh) - త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas). ఏంటి నిజమా.. వీరిద్దరూ కలిసిపోయారా.. అంటే నిజమే. బండ్ల గణేష్ - త్రివిక్రమ్ కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. వీరిద్దరి మధ్య పవన్ కళ్యాణ్ కోసం కోల్డ్ వార్ నడిచిన విషయం తెల్సిందే.

పవన్ కళ్యాణ్‌తో బండ్ల గణేష్ గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్‌బస్టర్ తీశాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయాలని బండ్ల గణేష్ గట్టిగా ట్రై చేశాడు. అయితే, పవన్ కళ్యాణ్ కథల ఎంపిక, డేట్స్ మరియు ప్రొడక్షన్ విషయాల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ జోక్యం ఎక్కువగా ఉంటుందని, త్రివిక్రమ్ వల్లే తనకు పవన్ డేట్స్ దొరకట్లేదని, పవన్ చుట్టూ త్రివిక్రమ్ ఒక కోట కట్టేసి, వేరే నిర్మాతలను రానివ్వట్లేదని బండ్ల చెప్పుకొచ్చాడు. ఇక అసలు గొడవ పీక్స్‌కి వెళ్ళింది మాత్రం భీమ్లా నాయక్ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ టైమ్‌లో. ఆ ఫంక్షన్‌కి బండ్ల గణేష్‌ను పిలవలేదు. దానికి కారణం త్రివిక్రమే అని ఆ టైమ్‌లో ఓ పవన్ కళ్యాణ్ అభిమానితో బండ్ల గణేష్ మాట్లాడిన ఆడియో కాల్ లీక్ అయి సంచలనం సృష్టించింది. ఆ ఆడియోలో బండ్ల గణేష్.. త్రివిక్రమ్‌ను ఉద్దేశించి చాలా ఘాటైన వ్యాఖ్యలు చేశాడు. నన్ను రాకుండా త్రివిక్రమ్ అడ్డుకున్నాడు, చూసుకుందాం.. వాడు, వీడు అంటూ ఓ రేంజ్‌లో మాట్లాడటంతో ఇద్దరి మధ్య గొడవ అఫీషియల్‌గా బయటపడింది.

అంతేకాకుండా బండ్ల గణేష్ పలు ఇంటర్వ్యూలలో డైరెక్ట్‌గా త్రివిక్రమ్ పేరు ఎత్తకుండా.. గురూజీలు.. ఇండస్ట్రీని నాశనం చేస్తున్నారు, సంసారాలను కూలుస్తున్నారు అంటూ చాలా సంచలన కామెంట్లు చేశాడు. ఆ కామెంట్లు అన్నీ త్రివిక్రమ్‌ను ఉద్దేశించినవే అని అందరికీ అర్థమైపోయింది. అలా ఎన్నో మాటలు అన్న బండ్ల గణేష్ గురించి త్రివిక్రమ్ ఎప్పుడూ నోరు ఎత్తలేదు. ఇక ఇన్ని విభేదాల తరువాత బండ్ల గణేష్ - త్రివిక్రమ్ కలవడం ప్రస్తుతం సంచలనంగా మారింది.

ఆదర్శకుటుంబం సినిమా సెట్ లో త్రివిక్రమ్ ని బండ్ల గణేష్ కలిసినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా బండ్ల గణేష్.. త్రివిక్రమ్ పట్ల తనకున్న అపారమైన ప్రేమను, గౌరవాన్ని మనస్ఫూర్తిగా తెలియజేశాడు. అంతేకాకుండా, ఆయన ఎల్లప్పుడూ మంచి ఆరోగ్యంతో, సంతోషంతో ఉండాలని, భవిష్యత్తులో మరెన్నో భారీ విజయాలను అందుకోవాలని ఆకాంక్షిస్తూ తన హృదయపూర్వక శుభాకాంక్షలు అందజేశాడు. ఇది చూసిన అభిమానులు అంటే మీరు.. మీరు కలిసిపోయారు అన్నమాట అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.

Updated Date - Jun 21 , 2026 | 05:12 PM