సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

కూతురు పెళ్లి.. కన్నీళ్లు పెట్టుకున్న బండ్ల గణేష్

ABN, Publish Date - Aug 16 , 2026 | 05:33 PM

ప్రముఖ సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కుమార్తె జనని వివాహం పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన చిలుకూరి సూర్యతేజతో హైదరాబాద్‌లోని జేఆర్సీ (JRC) కన్వెన్షన్ హాల్‌లో ఆగస్టు 16న అత్యంత వైభవంగా జరిగింది.

Bandla Ganesh

ప్రముఖ సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ (Bandla Ganesh) కుమార్తె జనని వివాహం పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన చిలుకూరి సూర్యతేజతో హైదరాబాద్‌లోని జేఆర్సీ (JRC) కన్వెన్షన్ హాల్‌లో ఆగస్టు 16న అత్యంత వైభవంగా జరిగింది. ఈ శుభకార్యానికి రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ అగ్రనేతలు, టాలీవుడ్ ప్రముఖులు భారీ సంఖ్యలో హాజరై నవదంపతులను ఆశీర్వదించారు.


ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి ప్రత్యేకంగా హాజరై వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేసి ఆశీస్సులందించారు. అలాగే తెలంగాణ సీఎం ఎ. రేవంత్ రెడ్డి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా కొణిదెల, అక్కినేని నాగార్జున, వెంకటేష్, చిరంజీవి దంపతులతో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఈ పెళ్లి వేడుకలో పాల్గొన్నారు.


ఎంతో వైభవంగా జరిగిన ఈ పెళ్లి వేడుకలో తన ముద్దుల కుమార్తెను సాగనంపే సమయంలో బండ్ల గణేష్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. చంద్రబాబు, భువనేశ్వరి వారి చేతుల మీదుగా మంగళసూత్రం వరుడుకు అందించారు. కూతురు మెడలో తాళి పడగానే.. బండ్ల ఎమోషనల్ అయ్యాడు. కూతురి పెళ్లిలో బండ్ల గణేష్ కన్నీళ్లు పెట్టుకున్న క్షణాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అభిమానులు, నెటిజన్లు ఎమోషనల్ అవుతున్నారు. ఎంత పెద్ద స్థాయికి ఎదిగినా, ఒక తండ్రికి కూతురిని సాగనంపే క్షణం కంటే మించిన భావోద్వేగం మరొకటి ఉండదని కామెంట్లు పెడుతున్నారు. నవదంపతులకు పలువురు సినీ రంగానికి చెందిన ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Updated Date - Aug 16 , 2026 | 05:33 PM