సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

సంగీత్‌లో.. ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ పాటల‌తో కుమ్మేసిన‌ బండ్ల గ‌ణేశ్ కుమారుడు

ABN, Publish Date - Aug 10 , 2026 | 09:44 AM

బండ్ల గణేష్ కుమారుడు బండ్ల హిరేష్ తన సోదరి జనని సంగీత్ వేడుకలో ఎన్టీఆర్ ‘టెంపర్’ పాటకు అదిరిపోయే డ్యాన్స్ చేశాడు. కుమారుడి డ్యాన్స్ చూసి బండ్ల గణేష్ ఎమోషనల్ అయ్యారు.

Bandla Ganesh

టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ (Bandla Ganesh) కుటుంబంలో పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆయన కుమార్తె జనని వివాహ వేడుకల్లో భాగంగా జరిగిన సంగీత్ కార్యక్రమంలో బండ్ల గణేష్ కుమారుడు బండ్ల హిరేష్ (Hiresh Bandla) చేసిన డ్యాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంగీత్ వేడుకలో హిరేష్ ఎన్టీఆర్ నటించిన ‘టెంపర్’ సినిమాలోని టైటిల్ సాంగ్‌కు అదిరిపోయే స్టెప్పులతో అలరించాడు. ఉత్సాహంగా డ్యాన్స్ చేసిన అతడిని చూసి కుటుంబ సభ్యులు, స్నేహితులు చప్పట్లతో ప్రోత్సహించారు. ముఖ్యంగా తన సోదరి జనని సైతం తమ్ముడి డ్యాన్స్‌ను చూసి ఈలలు వేస్తూ ఉత్సాహపరిచారు.

ఈ సందర్భంగా బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు అందరినీ భావోద్వేగానికి గురిచేస్తున్నాయి. తన కుమారుడిని జీవితంలో ఎంతో ఎత్తులో చూడాలని ఎన్నో కలలు కన్నానని.. మూడు రోజుల క్రితమే ‘డ్యాన్స్ చేయరా?’ అని తన కుమారుడిని అడిగానని, ఇప్పుడు సంగీత్ వేడుకలో అద్భుతంగా డ్యాన్స్ చేయడం చూసి సంతోషంగా ఉందని బండ్ల గణేష్ పేర్కొన్నారు.

ఇదిలాఉంటే.. హిరేష్ డ్యాన్స్‌లో ఎన్టీఆర్ ‘టెంపర్’ పాటతో పాటు రామ్ చరణ్ సినిమాకు సంబంధించిన పాటకు కూడా స్టెప్పులు వేసి స్టేజీని ద‌ద్ద‌రిల్లిచ్చాడు. తన సోదరి వివాహ వేడుకను మరింత సందడిగా మార్చిన హిరేష్ డ్యాన్స్‌కు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇక తన పిల్లలను ఎంతో ప్రేమగా చూసుకునే బండ్ల గణేష్.. కుమారుడి డ్యాన్స్‌ను చూసి భావోద్వేగానికి గురైన తీరు నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

Updated Date - Aug 10 , 2026 | 09:53 AM