సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Gabbar Singh: ‘పెద్ది’ కోసం బండ్లన్న త్యాగం.. గబ్బర్‌సింగ్‌ వాయిదా

ABN, Publish Date - Jun 18 , 2026 | 09:00 PM

నిర్మాత బండ్ల గణేష్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పవన్‌కల్యాణ్‌ హీరోగా నటించి, ఆయన్ను బ్లాక్‌బస్టర్‌ నిర్మాతగా మార్కెట్లో వదిలిన గబ్బర్‌సింగ్‌ చిత్రం రీ రిలీజ్‌ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు

bandla ganesh

నిర్మాత బండ్ల గణేష్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పవన్‌కల్యాణ్‌ హీరోగా నటించి, ఆయన్ను బ్లాక్‌బస్టర్‌ నిర్మాతగా మార్కెట్లో వదిలిన గబ్బర్‌సింగ్‌ చిత్రం రీ రిలీజ్‌ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి అటు పవన్‌ అభిమానుల్లో, ఇటు రామ్‌చరణ్‌ అభిమానుల్లో మరోసారి సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఈ నెల 26న గబ్బర్‌సింగ్‌ చిత్రాన్ని విడుదల చేయాలని బండ్ల గణేశ్‌ ప్లాన్‌ చేశారు. అయితే రామ్‌చరణ్‌ హీరోగా తెరకెక్కిన ‘పెద్ది’ చిత్రం సక్సెస్‌ఫుల్‌గా ఆడుతున్న నేపథ్యంలో ఆ సినిమాకు కలెక్షన్లను, థియేటర్‌లను తగ్గించకూడదనే ఉద్దేశంతో గబ్బర్‌సింగ్‌ రీ రిలీజ్‌ను ఆయన వాయిదా వేశారు.

విజయవంతంగా ఆడుతున్న ‘పెద్ది’ సినిమా కలెక్షన్లపై ఎలాంటి ప్రభావం పడకూడదనే ఉద్దేశంతో రీ-రిలీజ్‌ను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ఎక్స్‌ వేదికగా ప్రకటించారు. ‘పెద్ది’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి లభిస్తున్న అపూర్వ ఆదరణను గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. ‘గబ్బర్‌సింగ్‌’ రీ-రిలీజ్‌ డేట్‌ను త్వరల్లో వెల్లడిస్తామని ఆయన తెలిపారు. సినిమా వాయిదా పడినందుకు పవన్‌ అభిమానులు నిరాశ చెందిన మంచి ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయాన్ని అంగీకరిస్తూ కొత్త తేదీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

పవన్‌కల్యాణ్‌, శ్రుతీహాసన్‌ జంటగా హరీశ్‌ శంకర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 11, 2012లో విడుదలైంది. ఇప్పటికీ ఈ చిత్రంపై ఏమాత్రం క్రేజ్‌ తగ్గలేదు. పవన్‌కల్యాణ్‌కు మంచి కమ్‌బ్యాక్‌ చిత్రంగా నిలవడమే కాకుండా బండ్ల గణేష్‌ను బ్లాక్‌బస్టర్‌ ప్రొడ్యూసర్‌ను చేసింది.

Updated Date - Jun 18 , 2026 | 09:01 PM