సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

రాజ‌మౌళికి.. బండ్ల గ‌ణేశ్ పెళ్లి ఆహ్వానం

ABN, Publish Date - Jul 26 , 2026 | 09:16 AM

ప్ర‌ముఖ‌ నిర్మాత‌, న‌టుడు బండ్ల గ‌ణేశ్ కూతురు జ‌న‌ని వివాహం ఆగ‌స్టు 16న జ‌రుగ‌నున్న విష‌యం తెలిసిందే.

Bandla Ganesh

ప్ర‌ముఖ‌ నిర్మాత‌, న‌టుడు బండ్ల గ‌ణేశ్ (Bandla Ganesh) కూతురు జ‌న‌ని (Janani) వివాహం ఆగ‌స్టు 16న జ‌రుగ‌నున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో టాలీవుడ్ సెట‌బ్రిటీల‌ను గ‌ణేశ్ ప్ర‌త్యేకంగా ఆహ్వానిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే మెగాస్టార్ చిరంజీవి, మ‌హేశ్ బాబు (Mahesh Babu) వంటి స్లార్ల‌ను త‌న కుటుంబంతో స‌హా క‌లిశారు.

ఈ కొవ‌లోనే బండ్ల గ‌ణేశ్‌ తాజాగా ఆదివారం ఉద‌యం ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళిని ఆయ‌న భార్య‌ను వారి ఇంట్లో క‌లిసి త‌మ కూతురి పెళ్లికి ఆహ్వానిస్తూ ప‌త్రిక అంద‌జేశారు. ఈ విష‌యాన్ని గ‌ణేశ్ త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ ద్వారా తెలియ‌జేశారు. భారతీయ సినిమా గర్వించదగ్గ దర్శక దిగ్గజం.. శ్రీ రాజ‌మౌళి (ss rajamouli) గారిని కలిసి, ఆగస్టు 16న జరగనున్న మా కుమార్తె జనని వివాహ వేడుకకు ఆహ్వానించడం జరిగింది. అంటూ పోస్టు చేశారు. ప్ర‌స్తుతం ఈ పోస్టు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది.

Updated Date - Jul 26 , 2026 | 09:18 AM