DADA: ‘దాదా’లో హై వోల్టేజ్ యాక్షన్.. బాలయ్యతో మంచు మనోజ్ ఢీ
ABN, Publish Date - Oct 29 , 2026 | 01:07 PM
నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కలయికలో తెరకెక్కుతున్న చిత్రం ‘దాదా’. కాజల్ కథానాయిక. మంచు మనోజ్ నెగటివ్ రోల్ చేస్తున్నారు.
నందమూరి బాలకృష్ణ (NBK), గోపీచంద్ (gopichand Malineni) మలినేని కలయికలో తెరకెక్కుతున్న చిత్రం ‘దాదా’ (Dada). కాజల్ కథానాయిక. మంచు మనోజ్ నెగటివ్ రోల్ చేస్తున్నారు. షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ఇటీవల రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరణ కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ కాకినాడలో ప్రారంభం కానుందని తెలిసింది. నవంబర్ మొదటివారంలో మొదలయ్యే షెడ్యూల్ లో బాలకృష్ణ, మంచు మనోజ్‌లపై భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు తెలిసింది. ఈ క్లైమాక్స్ ఎపిసోడ్‌ను ప్రేక్షకులు ఉత్కంఠకు గురయ్యేలా రూపొందించేందుకు దర్శకుడు గోపీచంద్ మలినేని ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు, బాలయ్య, మనోజ్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించే యాక్షన్ సన్నివేశాలు అభిమానులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని మేకర్స్ చెబుతున్నారు.
ముంబయి గ్యాంగ్‌స్టర్ వరల్డ్ నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామాలో బాలకృష్ణ రెండు విభిన్న కోణాలున్న పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. బాలకృష్ణ మాస్ యాక్షన్, మంచు మనోజ్ ఎనర్జీ, గోపీచంద్ మలినేని దర్శకత్వం.. ఈ మూడు అంశాలు ‘దాదా’పై అంచనాలను పెంచుతున్నాయి. ఈ సినిమాను క్రిస్టమస్ సందర్భంగా డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.
ALSO READ:
Rudravanam PS: ప్రతి ఎపిసోడ్ క్లైమాక్స్ లాగా ఉంటుంది..
Pawan Kalyan: పవన్ కల్యాణ్.. ‘అర్జున’.. రేసులో ముగ్గురు బడా డైరెక్టర్లు!
Suriya: తిరుచ్చెందూరు మురుగన్ సేవలో సూర్య