సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

భారతీయ సినిమాకు తీరని లోటు: నందమూరి బాలకృష్ణ

ABN, Publish Date - Oct 03 , 2026 | 11:58 PM

సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ మూడు చిత్రాలలో నటించారు. ఆయన మృతి పట్ల బాలకృష్ణ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.

Singeetam Srinivasa Rao

సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ మూడు చిత్రాలలో నటించారు. అవి సోషియో ఫాంటసీ, జానపద, పౌరాణిక చిత్రాలు కావడం విశేషం. బాలకృష్ణ నట జీవితంలో 'భైరవ ద్వీపం, ఆదిత్య 369' మైలు రాళ్ళుగా నిలిచాయి.

సింగీతం మృతిపై బాలకృష్ణ సంతాపాన్ని తెలియచేస్తూ, 'ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు గారి మృతి నన్ను తీవ్రంగా కలచివేసింది. ఆయన మా కుటుంబానికి ఎంతో సన్నిహితులు. ఆయనతో కలిసి మేము మూడు విభిన్నమైన క్లాసిక్ చిత్రాలను రూపొందించాం — ‘ఆదిత్య 369’. ఇది తెలుగు సినిమాకే కాకుండా భారతీయ సినిమాకు కూడా ఒక కొత్త గుర్తింపును తీసుకొచ్చింది. ‘భైరవ ద్వీపం’ బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించి, జానపద చిత్రాల విభాగంలో ఇప్పటికీ సాటిలేని చిత్రంగా నిలిచింది. అలాగే పౌరాణిక చిత్రంగా ‘శ్రీకృష్ణార్జున విజయం’ రూపొందింది. సింగీతం శ్రీనివాసరావు గారు తన సినీ ప్రయాణాన్ని మహానటుడు కె.వి.రెడ్డి గారి వద్ద సహాయ దర్శకుడిగా ప్రారంభించారు. ఆయన దర్శకత్వం వహించిన అమర చిత్రం ‘మాయాబజార్’లో మా తండ్రిగారు తొలిసారిగా శ్రీకృష్ణుడి పాత్రలో నటించారు. అనంతరం మా తండ్రిగారు నటించిన అనేక చిత్రాలకు సింగీతం గారు అసోసియేట్‌గా పనిచేశారు. అందుకే మా కుటుంబంతో ఆయనకు ఉన్న అనుబంధం కేవలం సినిమాలకు మాత్రమే పరిమితం కాలేదు. ఆయన మరణం నాకు వ్యక్తిగతంగా తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాను' అని పేర్కొన్నారు.

Updated Date - Oct 03 , 2026 | 11:58 PM