సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

NBK111: మ‌రోసారి రెండక్షరాల టైటిల్‌తో బాల‌య్య‌.. ఈ సారి కూడా రికార్డులు బ‌ద్ద‌లే

ABN, Publish Date - Aug 26 , 2026 | 01:31 PM

నటసింహ బాలకృష్ణ 111వ సినిమాకు రెండు టైటిల్స్ వినిపిస్తున్నాయి. రెండూ రెండక్షరాల టైటిల్స్ కావడం విశేషం. బాలయ్య కెరీర్ లో 'రెండక్షరాల పేర్ల' సినిమాలు ఏ తీరున అలరించాయో గుర్తు చేసుకుందాం.

balakrishna

బాలకృష్ణ (nandamuri balakrishna) హీరోగా గోపీచంద్ మలినేని (gopichand malineni) దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. వీరిద్దరి తొలి కాంబోగా తెరకెక్కిన 'వీరసింహారెడ్డి' ఘనవిజయం సాధించడంతో ఈ రెండో చిత్రంపైనా ఫ్యాన్స్ కు హోప్స్ ఉండడం సహజమే. బాలయ్యకు ఇది 111వ చిత్రం కావడం వల్ల కూడా మరింత ఇంట్రెస్ట్ ప్రేక్షకుల్లో చోటు చేసుకుంది. ఈ సినిమా టైటిల్ పై కూడా ఫ్యాన్స్ లో ఎంతో ఆసక్తి ఉంది. 'గాడ్', 'దాదా' అన్న టైటిల్స్ ను పరిశీలిస్తున్నట్టు సమాచారం. బాలకృష్ణకు 'గాడ్ ఆఫ్ మాసెస్' అన్న టైటిల్ ఉంది కాబట్టి 'గాడ్' అనే పేరు సినిమాకు కూడా సమంజసంగా ఉంటుందని కొందరి మాట. ఈ మూవీ గ్లింప్స్ లోనే బాలయ్య రౌడీలను చిదగ్గొడుతూ కనిపించారు. కాబట్టి 'దాదా' అన్న టైటిల్ కూడా బాగుంటుందని టాక్. ఇలా ఈ రెండు టైటిల్స్ ఫిలిమ్ నగర్ లో భలేగా సందడి చేస్తున్నాయి.

బాలయ్య కెరీర్ ను పరిశీలిస్తే రెండక్షరాల టైటిల్స్ తో రూపొందిన చిత్రాలు రెండంటే రెండే కనిపిస్తాయి. అయితే ఆ రెండు సినిమాలూ ప్రేక్షకులను విశేషంగా అలరించినవి కావడం మరింత విశేషం. 1987 జూలై 31న విడుదలైన 'రాము' చిత్రం మొదటిది. ఫ్యామిలీ డ్రామాతో తెరకెక్కిన ఈ సినిమాకు ఆడియో పెద్ద మైనస్. అయినప్పటికీ ఎదురుగా ఎంతటి మ్యూజికల్ హిట్ ఉన్నా, కథాబలంతో 'రాము' ఘనవిజయం సాధించింది. ఈ సినిమా సిల్వర్ జూబ్లీ చూసింది. తరువాత 2010 ఏప్రిల్ 30న విడుదలైన 'సింహా' కూడా రెండక్షరాల టైటిల్ తోనే అలరించింది. ఈ సినిమా ఆ యేడాది బ్లాక్ బస్టర్ హిట్ గా నిలచింది. ఈ చిత్రం డైరెక్ట్ గా 200 రోజులు ప్రదర్శితమయింది. ఇలా రెండక్షరాల టైటిల్స్ తో రూపొందిన బాలయ్య రెండు సినిమాలు బంపర్ హిట్స్... అందువల్ల బాలయ్య 111వ చిత్రానికి కూడా రెండక్షరాల టైటిల్ కలసి వస్తుందనే ఫ్యాన్స్ భావిస్తున్నారు.

బాలకృష్ణ 111వ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట్ సతీశ్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ నాయికగా నటిస్తున్నారు... సంజయ్ దత్ ప్రతినాయక పాత్ర పోషిస్తున్నారు. సముతిర ఖని, మంచు మనోజ్, శరత్ కుమార్, అభిమన్యు సింగ్ ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ త్వరగా పూర్తి చేసి డిసెంబర్ లోగా రిలీజ్ చేసే ప్రయత్నంలో ఉన్నారు మేకర్స్. యాక్సిడెంట్ అయి రెస్ట్ తీసుకోవలసి ఉన్నా, బాలయ్య సైతం నిర్మాత బాగు కోసం సహకరించి షూటింగ్ లో త్వరలోనే పాల్గొంటారని తెలుస్తోంది. డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తారనీ వినికిడి. మరి ఏ టైటిల్ తో బాలయ్య 111వ చిత్రం జనం ముందు నిలచి, వారి మనసులు గెలుస్తుందో చూడాలి.

Updated Date - Aug 26 , 2026 | 01:31 PM