సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

పంథా మార్చిన బాలయ్య.. ముంబైకి షిఫ్ట్!

ABN, Publish Date - Feb 09 , 2026 | 06:55 AM

నందమూరి బాలకృష్ణ (Balakrishna) సినిమాలంటే ట్రేడ్ మార్క్ యాక్షన్‌తో కూడిన ఒక ప్రత్యేక శైలిలో సాగుతుంటాయి.

Balakrishna

నందమూరి బాలకృష్ణ (Balakrishna) సినిమాలంటే ట్రేడ్ మార్క్ యాక్షన్‌తో కూడిన ఒక ప్రత్యేక శైలిలో సాగుతుంటాయి. దశాబ్దాలుగా ఆయన సినిమాలను పరిశీలిస్తే, కథా గమనంలో కొన్ని అంశాలు క్రమం తప్పకుండా కనిపిస్తాయి. ముఖ్యంగా రెండు పాత్రలు ఉండటం లేదా ఒకే పాత్రలో రెండు విభిన్నమైన పాత్రలను చూపించడం బాలయ్యకు వెన్నతో పెట్టిన విద్య.

బాలయ్య సినిమాల్లో డ్యూయల్ రోల్ ఉందంటే ఖచ్చితంగా ఆ రెండు గెటప్పుల మధ్య భారీ వ్యత్యాసం ఉంటుంది. ఒక పాత్ర సాఫ్ట్‌గా ఉంటే, మరో పాత్ర మాస్ ఆడియన్స్‌కు పూనకాలు తెప్పించేలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. ఈ రెండు పాత్రల సరసన ఇద్దరు హీరోయిన్లు నటించడం, బలమైన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉండటం కథలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.

ఇటీవలి వచ్చిన అఖండ-2తో పాటు అంతకుముందు వచ్చిన డాకు మహారాజ్, వీరసింహారెడ్డి, లెజెండ్, సింహా వంటి చిత్రాలన్నీ దాదాపు ఇదే పంథాలో సాగాయి. దర్శకులు సైతం బాలయ్య ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని అవే ఫార్ములాలతో కథలు సిద్ధం చేస్తుంటారు. ఈ తరహా కథలను ఎన్నిసార్లు చూసినా నందమూరి అభిమానులు, సామాన్య ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుండటం విశేషం.

వీరసింహారెడ్డి వంటి భారీ హిట్ తర్వాత బాలయ్యతో మరో సినిమా చేయబోతున్న గోపీచంద్ మలినేని (Gopichand malineni), ఈసారి పాత ఫార్ములాకు భిన్నంగా వెళ్లాలని నిర్ణయించుకున్నారట. గతంలో అనుకున్న చారిత్రక నేపథ్యం ఉన్న కథలో రెండు పాత్రలు ఉన్నప్పటికీ, ప్రస్తుత మాస్ కథలో మాత్రం బాలయ్య ఒకే ఒక పవర్‌ఫుల్ పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది. ఈ సినిమా పూర్తి స్థాయి గ్యాంగ్‌స్టర్ డ్రామాగా రూపొందుతోంది. కథ మొత్తం ముంబయి మాఫియా నేపథ్యంలో సాగుతుందని సమాచారం.

బాలయ్య గత చిత్రాల్లోని స్టీరియో టైప్ ఇమేజ్‌ను బ్రేక్ చేసేలా, ఈ పాత్రను చాలా స్టైలిష్‌గా, అంతే ఇంటెన్స్‌గా గోపీచంద్ డిజైన్ చేసినట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా కోసం బాలయ్య తన లుక్‌ను పూర్తిగా మార్చబోతున్నారట. ఇటీవలే స్క్రిప్టుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, ప్రస్తుతం టీమ్ అంతా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమైందని తెలుస్తోంది. రాబోయే కొద్ది వారాల్లోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందట. షూటింగ్ మెజారిటీ భాగం ముంబయిలోని వాస్తవ లొకేషన్లలోనే జరపాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోందని సమాచారం.

ఇక నందమూరి అభిమానులకు పండగ అంటేనే బాలయ్య సినిమా. అందుకే ఈ క్రేజీ ప్రాజెక్టును వచ్చే సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి తీసుకు రావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. షూటింగ్ షెడ్యూల్స్ కూడా దానికి తగ్గట్టుగానే వేగంగా పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. మెగా పవర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌తో పెద్ది సినిమాను రూపొందిస్తున్న వెంకట సతీశ్‌ కిలారు వృద్ధి సినిమాస్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలయ్యకు ఆస్థాన సంగీత దర్శకుడిగా పేరు తెచ్చుకున్న తమన్ ఈ ప్రాజెక్టుకు సంగీతం అందించనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Updated Date - Feb 09 , 2026 | 09:12 AM