సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

బాలయ్య కోసం కొరటాల మాస్టర్ ప్లాన్.. NBK112లో ఊహించని మాస్ అవతార్!

ABN, Publish Date - Nov 09 , 2026 | 04:36 PM

బాలకృష్ణ – కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న NBK112 సినిమాపై ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి.

Balakrishna

గాడ్ ఆఫ్ మాసెస్, నటసింహం నందమూరి బాలకృష్ణ (Balakrishna) వేగం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కుర్ర హీరోలతో సమానంగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తున్నారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'దాదా' అనే మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చేస్తున్నారు బాలయ్య. 'వీరసింహారెడ్డి' తర్వాత వీరి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో 'దాదా'పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.

దాదా సినిమా పూర్తి కాగానే బాలయ్య తన తదుపరి ప్రాజెక్ట్ NBK112ని సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తోంది మరెవరో కాదు.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ (Koratala Siva). తొలిసారి బాలకృష్ణ, కొరటాల కాంబినేషన్‌లో సినిమా వస్తుండడంతో టాలీవుడ్ వర్గాల్లోనూ, అభిమానుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే జూన్‌లో ఈ సినిమాకు సంబంధించి గ్రాండ్‌గా ఓపెనింగ్ జరగ్గా.. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఫిల్మ్‌నగర్ వర్గాల్లో ఒక ఇంట్రెస్టింగ్ వార్త తెగ వైరల్ అవుతోంది. సాధారణంగా కొరటాల శివ సినిమాలంటే బలమైన సామాజిక అంశం, హృదయాలను హత్తుకునే భావోద్వేగాలు ఉంటాయి. కానీ ఈసారి బాలయ్య ఇమేజ్‌ను, ఆయన మాస్ ఫాలోయింగ్‌ను దృష్టిలో పెట్టుకుని కొరటాల తన స్టైల్ పూర్తిగా మార్చేశారట. బాలకృష్ణను ఇప్పటివరకు చూడని ఒక సరికొత్త మాస్ అవతార్‌లో చూపించేందుకు స్క్రిప్ట్ సిద్ధం చేశారట. ముఖ్యంగా పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌తో పాటు హై-వోల్టేజ్ పవర్‌ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని తెలుస్తోంది. అంతేకాదు, కొరటాల మార్క్ ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఈ కథలో ప్రధానంగా ఉంటాయట. 'దేవర' లాంటి విజయం తర్వాత కొరటాల శివ చేస్తున్న సినిమా కావడంతో కథ, కథనాలపై ప్రత్యేకంగా కసరత్తులు చేసి ఈ స్క్రిప్ట్‌ను రూపొందించారట.

ఇక ఈ భారీ చిత్రాన్ని ఎస్‌ఎల్వి సినిమాస్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ చెరుకూరి, మిక్కిలినేని సుధాకర్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అంతేకాదు, ఈ సినిమాలో నటించే నటీనటుల విషయంలోనూ రకరకాల రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. తమిళ హ్యాండ్‌సమ్ హీరో ఆర్య, బాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ అండ్ యాక్టర్ అనురాగ్ కశ్యప్, అలాగే టాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ నటీనటుల ఎంపికపై మూవీ మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఏది ఏమైనా బాలకృష్ణ మాస్ ఇమేజ్, కొరటాల పవర్‌ఫుల్ టేకింగ్ తోడైతే బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విధ్వంసం ఉంటుందో చూడాలంటే ఈ సినిమా వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Updated Date - Nov 09 , 2026 | 04:49 PM