మోక్షజ్ఞ చిత్రంలో బాలకృష్ణ?
ABN, Publish Date - Sep 11 , 2026 | 09:14 AM
నందమూరి మోక్షజ్ఞ (Mokshagna) నటించనున్న తొలి చిత్రాన్ని ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే.
నందమూరి మోక్షజ్ఞ (Mokshagna) నటించనున్న తొలి చిత్రాన్ని ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా గురించి ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో బాలకృష్ణ (Balakrishna) ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నట్లు ఆ వార్తల సారాంశం. కథానాయికగా శ్రీలీల (sreeleela)ను ఎంపిక చేయనున్నట్లు తెలిసింది.
ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రారంభించి ఇతర వివరాలు వెల్లడించనున్నారు. దర్శకుడు వశిష్ఠ తెరకెక్కించనున్న ఈ చిత్రాన్ని మైత్రీమూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ నటిస్తున్న ‘దాదా’ చిత్రం డిసెంబరు 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.