మా దొడ్డ బాలయ్య.. రోడ్ సైడ్ స్టాల్‌లో టీ తాగిన బాలయ్య
ABN, Publish Date - Feb 19 , 2026 | 04:27 PM
రెండు రోజుల పర్యటన నిమిత్తం హిందూపూర్ వచ్చిన బాలయ్య అక్కడ ఓ టీ స్టాల్ ప్రారంభించి టీ తాగారు.
బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఆ పేరు వింటేనే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఓ వైబ్ వస్తుంది. ఆయన కోప్పడ్డా, నవ్వినా, చేతిలో నుంచి అద్దాలు, బాటిళ్లు, సెల్‌ఫోన్లు ఎగరవేసినా సోషల్ మీడియాలో అంతుకుమించి అనే రేంజ్‌లో క్షణాల్లో వైరల్ అవుతుంది. అంతేగాక ఓ వైపు వరుసగా సినిమాలు చేస్తూ హ్యాట్రిక్ విజయాలతో అప్రతిహాతంగా దూసుకుపోతున్నారు. మరోవైపు సేవా కార్యక్రమాలతో, తన సొంత నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ తీరిక లేకుండా గడుపుతున్నారు.
అయితే తాజాగా హిందూపూర్ ( Hindupur constituency)లో రెండు రోజుల పర్యటన నిమిత్తం వచ్చిన బాలయ్య అక్కడ పలు అభివృద్ధి పనుల కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. జనంతో మమేకమై కాలనీల్లో కలియ తిరిగారు. ఈ సందర్భంగా ఓ అభిమాని, మహిళా కార్యకర్త కోరిక మేరకు ఆమె నూతనంగా ఏర్పాటు చేసిన టీ స్టాల్‌ను ప్రారంభించారు. అనంతరం అక్కడే టీ తాగి అక్కడకు వచ్చిన వారితో సరదాగా మాట్లాడారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఇదిరా మా బాలయ్య అని కామెంట్లు పెడుతున్నారు. మనస్సులో కల్మషం లేని వ్యక్తి మా దొడ్డ బాలయ్య.. అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.