సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

రోడ్డు విస్తరణకు.. హీరో బాలకృష్ణ ఇంటి స్థలం! నాడు బాల‌య్య కోసం.. ఎన్టీఆర్ క‌ట్టించిన ఇల్లు

ABN, Publish Date - Oct 12 , 2026 | 05:56 AM

కేబీఆర్) పార్కు చుట్టూ వన్ వే ట్రాఫిక్ విధానం కోసం ప్రభుత్వం చేపట్టిన రహదారి విస్తరణకు తన ఇంటి స్థలాన్ని ఇచ్చేందుకు సినీ నటుడు బాలకృష్ణ ముందుకొచ్చారు.

Nandamuri Balakrishna

హైదరాబాద్‌లోని కాసు బ్రహ్మానందరెడ్డి (కేబీఆర్) పార్కు (Kasu Brahmananda Reddy (KBR) Park) చుట్టూ వన్ వే ట్రాఫిక్ విధానం కోసం ప్రభుత్వం చేపట్టిన రహదారి విస్తరణకు తన ఇంటి స్థలాన్ని ఇచ్చేందుకు ప్రముఖ సినీ నటుడు, ఏపీలోని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ముందుకొచ్చారు. దాదాపు 862.77 చదరపు గజాల స్థలాన్ని ఇచ్చేందుకు ఆయన అంగీకరిం చారు. దాంతో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ (Jubilee Hills) నుంచి కేబుల్‌ బ్రిడ్జి, దుర్గం చెరువు, నాలెడ్జ్ సిటీ వైపు వెళ్లేందుకు ట్రాఫిక్ రద్దీ తగ్గడంతో పాటు సమయం కూడా ఆదా అవనుంది. మరోవైపు కేబీఆర్ పార్కు (KBR Park) ప్రధాన ప్రవేశ ద్వారం జంక్షన్ వద్ద ఉన్న తన స్థలాన్ని ఇచ్చేందుకు శబ్దాలయ స్టూడియో (Shabdalaya Studios) అంగీకరించింది.

జూబ్లీహిల్స్ లోపలి కాలనీలు, గచ్చిబౌలి, పశ్చిమ ఐటీ కారిడార్ ఫిల్మ్ నగర్ జంక్షన్‌ను అనుసంధానించేందుకు భవ్య కన్‌స్ట్ర‌క్షన్ (Bhavya Constructions) తన భూమిని ఇచ్చేందుకు ముందుకొచ్చింది. ఎలాంటి పరిహారం తీసుకోకుండా ట్రాన్స్పరబుల్ డెవలప్‌మెంట్ రైట్స్ (టీడీఆర్)లతోనే స్థలాలు ఇచ్చేందుకు ఒప్పుకున్నాయి. కేబీఆర్ పార్కు చుట్టూ ట్రాఫిక్ సమస్యకు స్వస్తి పలికేందుకు వన్ వే (ఒకే వైపు ప్రయాణం) విధానాన్ని ప్రవేశపెట్టగా అది విజయవంతమైంది. దీంతో ఈ విధానాన్నే శాశ్వతంగా అమలుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అక్కడక్కడా చిన్న సమస్యలున్నాయి. వాటిని పరిష్కరించి వాహనాలు వేగంగా వెళ్లేలా జీహెచ్ఎంసీ పనులు చేపట్టింది.

ఎన్టీఆర్ తన అభిమానులను కలిసిన ఇల్లు..

రోడ్డు విస్తరణ కోసం బాలకృష్ణ శబ్దాలయ స్టూడియో, భవ్య కన్‌స్ట్ర‌క్షన్ ఇస్తున్న స్థలాలు గజం రూ.45 లక్షల వరకు పలుకుతున్నాయి. కీలకమైన ప్రాంతంలో ఉండటంతో ఇవి వ్యాపారానికి ఎంతో ఉపయుక్తమైనవి. బాలకృష్ణ కోసం ఆయన తండ్రి ఎన్టీఆర్ (NTR) 1982లో ఈ ఇంటిని నిర్మించి ఇచ్చారు. దశాబ్దాలుగా బాలకృష్ణ ఆ ఇంట్లోనే ఉంటున్నారు. నందమూరి కుటుంబ వేడుకలకు ఆ ఇల్లు ఓ వేదిక. ఎన్టీఆర్ తన అభిమానులను ఇంట్లోనే కలిసేవారు. ఇంత అను బంధం ఉన్నప్పటికీ ప్రజా ప్రయోజనాల కోసం ఆ స్థలాన్ని ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకరించారు.

ప్రస్తుత పనులతో బాల కృష్ణ ఇంటిలోని ఓ భవనం సగానికి పైగా పోతోంది. దీంతో ఆయన ఇక్కడి నుంచి వేరే చో టుకు మారాల్సి వస్తోంది.అదేవిధంగా కేబీఆర్ ఎంట్రన్స్ జంక్షన్ వద్ద శబ్దాలయ స్టూడియోకు చెందిన 608 చదరపు గజాల స్థలాన్ని ఫ్రీ-లెఫ్ట్ రోడ్డు విస్తరణ కోసం తీసుకుంటున్నారు. దీనివల్ల స్టూడియో ప్రహరీ గోడ పూర్తిగా పోవడంతో పాటు ప్రధాన భవనం వరకు పనులు సాగుతున్నాయి. ఫిల్మ్ నగర్ జంక్షన్ వద్ద రోడ్డును కొంత మార్చితే వాహనాలు లేన్ మారేందుకు ఆటంకాలు ఉండవు. ఇక్కడ పనుల కోసం భవ్య కన్‌స్ట్ర‌క్షన్‌కు చెందిన సుమారు 34133 చదరపు గజాలు స్థలాన్ని తీసుకోనున్నారు. దీంతో ఆ సంస్థ భవనం పూర్తిగా పోతోంది.

ఐదు జంక్షన్లు దాటేలా ఎలివేటెడ్ కారిడార్..

ముఫఖంజా కాలేజీ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వరకు 4.3 కిలోమీటర్ల దూరం ప్రతిపాదించిన 6 వరుసల ఎలివేటెడ్ కారిడార్ పనులు జోరుగా సాగుతున్నాయి. రూ.1,090 కోట్లతో ఇక్కడ స్టీల్ ఫ్లై ఓవర్ నిర్మించనున్నారు. ఈ ఎలివేటెడ్ కారిడార్ నుంచి బంజారాహిల్స్ రోడ్ నెం-1ను అనుసంధానించేలా ప్రత్యేక కనెక్టింగ్ ర్యాంప్ నిర్మిస్తున్నారు. ఈ ఎలివేటెడ్ కారిడార్ 5 ప్రధాన ట్రాఫిక్ జంక్షన్ల వద్ద ఆగే అవసరం ఉండదు. దీనికి బదులుగా రహ దారుల విస్తరణ చేపడితే ప్రైవేట్ ఆస్తుల సేకరణకే సుమారు రూ.1000 కోట్లు వెచ్చించాల్సి వచ్చేది.

Updated Date - Oct 12 , 2026 | 06:06 AM