సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

NBK 112: బాలయ్య‌, కొర‌టాల శివ సినిమా.. ఇంకా ఎన్ని ఫ్లాన్ చేస్తున్నార‌య్యా!

ABN, Publish Date - Sep 06 , 2026 | 09:56 PM

తొలిసారి బాలయ్య-కొరటాల కాంబోలో వస్తున్న సినిమాకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

Balakrishna

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ (Balakrishna), కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్‌లో ఒక భారీ చిత్రం తెరకెక్కబోతోంది. వీరిద్దరి కాంబో ప్రకటన వచ్చినప్పటి నుంచే టాలీవుడ్‌తో పాటు సినీ వర్గాల్లోనూ ఈ ప్రాజెక్ట్‌పై విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. పవర్‌ఫుల్ మాస్ ఎలిమెంట్స్‌తో పాటు బలమైన సామాజిక సందేశాన్ని జోడించి కథలను తెరకెక్కించడంలో దిట్ట అయిన కొరటాల శివ, బాలకృష్ణ కోసం ఒక మైండ్ బ్లోయింగ్ కథను సిద్ధం చేసినట్లు సమాచారం.

తొలిసారి బాలయ్య-కొరటాల కాంబోలో వస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. గతంలో బాలయ్య బ్లాక్ బస్టర్ 'సింహ' చిత్రానికి కొరటాల శివ పనిచేసినా, అది కేవలం రచయితగా మాత్రమే చేశారు. ఇక ఈ సినిమాకి రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా.. ఎస్‌ఎల్వి సినిమాస్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ చెరుకూరి, సుధాకర్ మిక్కిలినేని సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. NBK112 షూటింగ్‌లో వచ్చే నెల నుంచి పాల్గొనేందుకు బాలయ్య అంగీకరించినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. బాలయ్య తన NBK111 షూటింగ్‌లో గాయపడిన విషయం విదితమే. దీంతో ఆయనకు శస్త్రచికిత్స జరగడంతో విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే ప్రస్తుతం వేగంగా కోలుకుంటున్న బాలయ్య వచ్చే నెల నుంచి షూటింగ్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్.

ఇక ప్రస్తుతం ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కొరటాల శివ సినిమా అనగానే కేవలం మాస్ ఎలిమెంట్స్ మాత్రమే కాకుండా, ఒక బలమైన సామాజిక నేపథ్యం, గుండెను పిండేసే కుటుంబ భావోద్వేగాలు ఉంటాయి. అటు 'దేవర' లాంటి విజయం తర్వాత కొరటాల చేస్తున్న సినిమా కావడంతో కథ, కథనాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. దీంతో బాలయ్యను ఇప్పటివరకు చూడని ఒక పూర్తి స్థాయి మాస్, ఎమోషనల్ అవతార్‌లో ప్రెజెంట్ చేయబోతున్నారట.

ఇక ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో కోలీవుడ్ హ్యాండ్‌సమ్ హీరో ఆర్య నటించనున్నట్లు తెలుస్తోంది. కొరటాల శివ ఈ సినిమాలో ఒక పోలీస్ క్యారెక్టర్‌ను చాలా పవర్‌ఫుల్‌గా, డిఫరెంట్‌గా డిజైన్ చేశారు. ఆ రోల్ కోసం తమిళ నటుడు ఆర్యను సంప్రదించినట్లు సమాచారం. బాలయ్య సినిమాలో ఈ పవర్‌ఫుల్ పోలీస్ రోల్‌లో ఆర్య కనుక ఖరారైతే, సినిమా రేంజ్ మరో లెవెల్‌కు వెళ్లడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ కూడా NBK112లో ఒక అత్యంత కీలకమైన పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.

అయితే ఆమె ఇందులో హీరోయిన్‌గా కాకుండా, పూర్తిస్థాయి నెగిటివ్ షేడ్స్ ఉన్న పవర్‌ఫుల్ విలన్ పాత్రలో నటించబోతున్నట్లు ఫిలిం నగర్ టాక్. తన సహజసిద్ధమైన నటనతో హోమ్‌లీ రోల్స్‌లో మెప్పించిన ఐశ్వర్య రాజేష్.. బాలయ్యకు పోటీగా విలన్ షేడ్స్ ఉన్న పాత్రను ఎంచుకోవడం ఈ సినిమాపై ఆసక్తిని ఒక్కసారిగా నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్ళింది. దీనిపై కూడా మేకర్స్ నుంచి త్వరలోనే స్పష్టత రానుంది. మరి బాలయ్య - కొరటాల శివ కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి హిస్టరీ క్రియేట్ చేస్తుందో చూడాలంటే సినిమా థియేటర్లలోకి వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Updated Date - Sep 06 , 2026 | 09:56 PM