ఓఆర్ఆర్‌పై ఘోర ప్రమాదం.. యువ నటుడు, డీఓపీ దుర్మరణం
ABN, Publish Date - May 11 , 2026 | 07:27 AM
రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల వద్ద ఔటర్ రింగురోడ్డు (ఓఆర్ఆర్) పై ఆదివారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల వద్ద ఔటర్ రింగురోడ్డు (ఓఆర్ఆర్) (Hyderabad ORR ) పై ఆదివారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ముందు వెళ్తున్న కంటైనర్ లారీని వెనుక నుంచి ఓ కారు అతి వేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
యూ ట్యూబ్ నుంచి క్రమంగా ఎదుగుతూ సినిమాల్లో నటిస్తూ మంచి పేరు తెచ్చుకున్న కత్తి భరత్ (Bharat) (31), సాయి త్రిలోక్ (Trilok) (31) ఇద్దరు స్నేహితులు. రెండు రోజుల క్రితం వారు నెల్లూరు జిల్లాలోని తమ స్వగ్రామానికి వెళ్లారు. తిరిగి వస్తుండగా ఓఆర్ ఆర్‌పై బొంగులూరు గేటు వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆ సమయంలో కత్తి భరత్ కారును నడుపుతున్నాడు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి నట్లు ఆదిభట్ల సీఐ రవికుమార్ తెలిపారు.