సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Raakaa: అల్లు అర్జున్ మూవీపై బబ్లూ పృథ్వీరాజ్ కీలక వ్యాఖ్యలు

ABN, Publish Date - Sep 06 , 2026 | 12:57 PM

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun), అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ' రాకా' (Raaka).  పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun), అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ' రాకా' (Raaka).  పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. కొంతకాలంగా ఈ సినిమాకు సంబంధించి  పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ చిత్రంలో నటిస్తున్న సీనియర్ నటుడు తన పాత్ర గురించి చెప్పడంతో మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.

నటుడు బబ్లూ పృథ్వీరాజ్ ‘రాకా’లో భాగమైనట్టు వెల్లడించారు. ఇటీవల ‘యానిమల్’ సినిమాలో కీలక పాత్రలో కనిపించిన ఆయన.. ఇప్పుడు అల్లు అర్జున్ నటిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌లోనూ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నట్టు తెలిపారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బబ్లూ పృథ్వీరాజ్ మాట్లాడుతూ ’ షూటింగ్ సమయంలో తనకు ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. ''రాకా' సినిమాలోపాత్ర కోసం పూర్తిగా భిన్నమైన లుక్‌ను సిద్ధం చేశారు దర్శకుడు. కథలో నా పాత్రకు ప్రాధాన్యత ఉంది.  దర్శకుడు అట్లీతో కలిసి పనిచేసే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. అలాగే అల్లు అర్జున్‌తో కలిసి ఇంత భారీ స్థాయి చిత్రంలో నటించాలన్న కోరిక నెరవేరింది' అన్నారు. ఈ సినిమా తన కెరీర్‌లో ప్రత్యేకమైన ప్రాజెక్ట్‌గా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇందులో దీపికా పడుకోణెతో పాటు మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ కూడా సినిమాలో కీలక పాత్రల్లో కనిపించనున్నట్టు ప్రచారం జరుగుతోంది.  మాఫియా నేపథ్యంలో సాగే యాక్షన్ కథగా ఈ సినిమా రూపొందుతున్నట్టు సమాచారం. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ కోసం ఇండియన్ సినిమాతో పాటు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన పలువురు టెక్నీషియన్లు పనిచేస్తున్నారు.

Updated Date - Sep 06 , 2026 | 01:07 PM