సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్‌.. వ్యాపారవేత్తతో స్వీటీ పెళ్లి?

ABN, Publish Date - Mar 16 , 2026 | 07:16 PM

గత రెండు మూడు రోజులుగా నటి అనుష్క శెట్టి (Anushka Shetty) పెళ్లి గురించి సోషల్‌ మీడియా, వెబ్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.

Anushka Shetty

గత రెండు మూడు రోజులుగా నటి అనుష్క శెట్టి (Anushka Shetty) పెళ్లి గురించి సోషల్‌ మీడియా, వెబ్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. 44 ఏళ్ల అనుష్కకు బెంగళూరుకు చెందిన ఒక ప్రముఖ వ్యాపారవేత్తతో వివాహం నిశ్చ‌య‌మైందనేది ఆ వార్తల సారాంశం.

ఆ వ్యాపారవేత్త అనుష్క కుటుంబానికి అత్యంత సన్నిహితుడని, పెద్దలు మాట్లాడుకొని ఈ పెళ్లిని ఖాయం చేశారని, ఈ ఏడాది చివర్లో ఆమె పెళ్లి పీటలు ఎక్కుతారని ఆ కథనాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ వార్తలపై ఇప్పటివరకూ అధికారిక నిర్ధారణ లేదు.

అనుష్కశెట్టి, ఆమె కుటుంబ సభ్యులు, పీఆర్‌ టీమ్‌ ఈ వార్తలపై స్పందించలేదు. గతంలోనూ పలుమార్లు అనుష్క పెళ్లి గురించి ప్రచారం జరిగినా అవేవీ నిజం కాలేదు. ప్రస్తుతం ‘కథనార్‌’ అనే మలయాళ చిత్రంలో ఆమె నటిస్తున్నారు.

Updated Date - Mar 16 , 2026 | 09:08 PM