Avika gor: బుల్లితెరకు అవికా గోర్ రీఎంట్రీ?
ABN, Publish Date - Jul 24 , 2026 | 03:57 PM
'చిన్నారి పెళ్లికూతురు' సీరియల్‌తో దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్న నటి అవికా గోర్. సీరియళ్లకు కొంత గ్యాప్ ఇచ్చి సినిమాల బాట పట్టింది ఈ బ్యూటీ.
'చిన్నారి పెళ్లికూతురు' సీరియల్‌తో దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్న నటి అవికా గోర్ (Avika gor). సీరియళ్లకు కొంత గ్యాప్ ఇచ్చి సినిమాల బాట పట్టింది ఈ బ్యూటీ. తర్వాత వెబ్‌సిరీస్‌లతోనూ మెప్పించింది. కొన్ని సినిమాలు కలిసొచ్చినా మరి కొన్ని మాత్రం నిరాశ పరిచాయి. తాజాగా ఆమె మళ్ళీ పైకి రాబోతుందని వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. "ప్రయాణం మొదలుపెట్టిన చోటుకే మళ్లీ చేరుకోవడం ఎంతో అందమైన విషయం. జీవితం కొన్నిసార్లు మనల్ని మన మూలాల దగ్గరకు తీసుకెళ్తుంది. అది వెనక్కి వెళ్లడం కాదు... కొత్త దృష్టితో వాటిని అర్థం చేసుకునేంతగా మనం ఎదిగామని చెప్పే సంకేతం" అంటూ పోస్ట్ లో పేర్కొన్నారు. ఈ పోస్ట్ అభిమానుల్లో కొత్త చర్చకు దారితీసింది. 'మూలాల దగ్గరకు తిరిగి రావడం' అని చేసిన వ్యాఖ్య టెలివిజన్ రంగంలోకి రావడం గురించేనా అని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.
అయితే ఇందుకు మరో కారణం కూడా ఉంది. ఇటీవల అవికా గోర్ ప్రముఖ టెలివిజన్ నిర్మాణ సంస్థ ఎస్‌జే స్టూడియోస్ కార్యాలయాన్ని సందర్శించారు. అప్పటి నుంచే ఆమె కొత్త సీరియల్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఇప్పుడు ఆమె చేసిన తాజా పోస్ట్‌తో ఆ ప్రచారం మరింత బలపడింది. అవికా గోర్ మాత్రం ఇప్పటివరకు తన కొత్త ప్రాజెక్ట్‌పై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయినప్పటికీ, ఒకప్పుడు బుల్లితెరపై సంచలనం సృష్టించిన ఈ నటి మళ్లీ టెలివిజన్‌లో కనిపిస్తే ప్రేక్షకులు ఎలా స్వాగతిస్తారో చూడాల్సి ఉంది. ప్రస్తుతం ఆమె పోస్ట్ మాత్రం అభిమానుల్లో ఆసక్తిని రెట్టింపు చేసింది.