సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఆగస్టు పాన్ ఇండియా మూవీస్ కు అపజయాలే అధికం !

ABN, Publish Date - Aug 30 , 2026 | 07:07 AM

పాన్ ఇండియా మూవీస్ కు ఆగస్టు మాసం అచ్చిరాదని అంటున్నారు సినీ ఫ్యాన్స్. గత ఐదేళ్ళలో విడుదలైన పాన్ ఇండియా సినిమాలను పరిశీలిస్తే అది నిజమే అనిపిస్తోంది.

పాన్ ఇండియా (Pan India Movies) మూవీస్ కు ఆగస్టు మాసం అచ్చిరాదని అంటున్నారు సినీ ఫ్యాన్స్. గత ఐదేళ్ళలో విడుదలైన పాన్ ఇండియా సినిమాలను పరిశీలిస్తే అది నిజమే అనిపిస్తోంది. మరి సక్సెస్ లేమీ లేవా అంటే - ఉన్నాయ్. కానీ ఫ్లాపులే ఎక్కువగా కనిపిస్తున్నాయ్. ఆ ముచ్చటేంటో చూద్దాం...

మూడొంతులు పరాజయాలే...
అదుగో ఇదుగో అంటూ ఎప్పుడో రావలసిన 'టాక్సిక్' సినిమా ఆగస్టు 26వ తేదీ జనం ముందు నిలచింది. వారి మనసులను ఏ మాత్రం గెలవలేకపోయింది. ఊరిస్తూ వచ్చిన 'టాక్సిక్'ను చూసి సినీ ఫ్యాన్స్ ఉసూరుమన్నారు. దాంతో ఆగస్టు మాసం పాన్ ఇండియా మూవీస్ కు అచ్చిరాదని తేల్చేశారు. ఓ ఐదేళ్ళ నాటి లెక్కలూ తీశారు. అలాగని ఈ ఐదు సంవత్సరాలలో ఆగస్టు నెలలో విడుదలైన పాన్ ఇండియా మూవీస్ అన్నీ పరాజయాలేమీ కావు. అయితే ఐదేళ్ళలో ఓ డజన్ పాన్ ఇండియా మూవీస్ వెలుగు చూశాయి. వాటిలో మూడు చిత్రాలు మాత్రమే విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అలా తీసుకుంటే పరాజయాల శాతమే ఎక్కువగా ఉంది కాబట్టి సినీ ఫ్యాన్స్ అన్నట్టు పాన్ ఇండియా సినిమాలకు ఆగస్టు అచ్చిరాదని అంగీకరించాల్సి వస్తుంది. 'టాక్సిక్' లాగే గత సంవత్సరం యన్టీఆర్, హృతిక్ రోషన్ కలసి నటించిన హిందీ ఒరిజినల్ 'వార్-2' పాన్ ఇండియా పిక్చర్ గానే జనం ముందు నిలచింది. గత యేడాది ఆగస్టు 14న విడుదలైన 'వార్-2' అట్టర్ ఫ్లాప్ అనిపించుకుంది.

తెలుగు నుండి మూడు...

మన తెలుగు చిత్రసీమ నుండి విడుదలైన పాన్ ఇండియా మూవీస్ లో 2022 ఆగస్టు 25న వచ్చిన 'లైగర్' డిజాస్టర్ గా నిలచింది...పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా భారీ వ్యయంతో తెరకెక్కిన 'లైగర్' జనాన్ని ఎంతగానో ఊరించింది. వారి అంచనాలను రీచ్ కాకపోవడంతో 'లైగర్' పరాజయం పాలయింది. 2024 ఆగస్టు 29న విడుదలయిన నాని 'సరిపోదా శనివారం' కూడా ఆల్ ఇండియాలో విడుదలయింది. ఈ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. అయితే 2022 ఆగస్టు 13న 'లైగర్' కంటే 12 రోజులు ముందు విడుదలయిన 'కార్తికేయ-2' బంపర్ హిట్ గా నిలచింది. ఈ సినిమా ఉత్తరాదివారిని సైతం విశేషంగా ఆకట్టుకుంది. అలా ఈ ఐదేళ్ళలో మన తెలుగు నుండి మూడు సినిమాలు పాన్ ఇండియా మూవీస్ గా ఆగస్టు నెలలో వచ్చాయి. వాటిలో నిఖిల్ హీరోగా రూపొందిన 'కార్తికేయ-2' మాత్రమే మురిపించింది.

నాలుగేళ్ళు వరుసగా తమిళ సినిమాలు..
.
ఈ ఐదేళ్ళలో ఎక్కువ పాన్ ఇండియా పిక్చర్స్ ను ఆగస్టులో రిలీజ్ చేసింది కోలీవుడ్ అనే చెప్పాలి. తమిళం నుండి 2023 నుండి ప్రతి యేటా ఓ పాన్ ఇండియా సినిమా ఆగస్టులో వెలుగు చూసింది. అలా నాలుగు చిత్రాలు ఆగస్టులో ఆల్ ఇండియాలో రిలీజ్ అయ్యాయి. వాటిలో 2023 ఆగస్టు 10న విడుదలైన రజనీకాంత్ 'జైలర్' మూవీ బంపర్ హిట్ గా నిలచింది. ఈ సినిమా రజనీ కమ్ బ్యాక్ గా చెప్పవచ్చు.


ఆ మూడూ అంతే...
తమిళ చిత్రసీమ నుండి వెలుగు చూసిన ఇతర ఆగస్టు పాన్ ఇండియా మూవీస్ ఏవంటే - 2024 ఆగస్టు 15న విడుదలైన విక్రమ్ 'తంగలాన్'. ఇది పరాజయం పాలైంది. 2025 ఆగస్టు 14న జనం ముందు నిలచిన రజనీకాంత్ - నాగార్జున నటించిన 'కూలి' ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది ఈ యేడాది 

మళయాళం మూడు... కన్నడ ఒక్కటే...
కన్నడ చిత్రసీమ నుండి 2022 నుండి 2026 మధ్య ఐదేళ్ళ కాలంలో ఒకే ఒక్క పాన్ ఇండియా మూవీ వెలుగు చూసింది... అదే ఈ యేడాది వచ్చిన 'టాక్సిక్'... దాని ఫలితం అందరికీ తెలిసిందే... ఇక మళయాళ సినిమా రంగం నుండి దుల్కర్ సల్మాన్ నటించిన 'కింగ్ ఆఫ్‌ కొత్త' చిత్రం 2023 ఆగస్టు 24న విడుదలయింది... ఈ మూవీ ఫ్లాప్ గా నిలచింది... ఆ తరువాత దుల్కర్ నిర్మించగా డోమ్నిక్ అరుణ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'లోకా- ఛాప్టర్ 1: చంద్ర' 2025 ఆగస్టు 28న విడుదలై విజయఢంకా మోగించింది... ఈ పాన్ ఇండియా మూవీతో కళ్యాణి ప్రియదర్శన్ కు ఉత్తరాదిన సైతం మంచి క్రేజ్ లభించింది... ఈ యేడాది ఆగస్టు 20వ తేదీన పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన 'ఖలీఫా - ద రూలర్' మళయాళ, హిందీ భాషల్లో విడుదలయింది... ఏ మాత్రం ఆకట్టుకోలేక పోయింది...

రాబోయే రోజుల్లో...
ఈ యేడాది తెలుగు నుండి ఆగస్టులో పాన్ ఇండియా పిక్చర్ ఏదీ వెలుగు చూడలేదు. అయితే కోలీవుడ్ నుండి 'జీడీయన్', శాండల్ వుడ్ ద్వారా 'టాక్సిక్', మల్లూవుడ్ నుండి 'ఖలీఫా' ఆగస్టులో వెలుగు చూశాయి. అయితే ఈ మూడు చిత్రాలు ఏ మాత్రం ఆకట్టుకోకపోవడం గమనార్హం. అందువల్లే ఆగస్టులో రిలీజైన  పాన్ ఇండియా పిక్చర్స్ పై సినీ ఫ్యాన్స్ దృష్టి సారించారు. సౌత్ నుండి వచ్చే పాన్ ఇండియా మూవీస్ లో వైవిధ్యం ఉంటుందని ఉత్తరాదివారు సైతం భావించేవారు... అందువల్లే ఈ సినిమాలపై ఆసక్తిగా ఎదురుచూశారు. వీటిలో 'జీడీయన్' లాంటి బయోపిక్ బంపర్ హిట్ అవుతుందని ఆశించరాదు. మాధవన్ కు ఆ సినిమా నటునిగా మంచి మార్కులే సంపాదించి పెట్టింది. 'ఖలీఫా' పృథ్వీరాజ్ సుకుమారన్ కు నిరాశనే మిగిల్చింది. ఇక యశ్ నటించి, స్క్రీన్ ప్లే రాసి, నిర్మాణభాగస్వామిగా ఉన్న 'టాక్సిక్' భారీ ఓపెనింగ్స్ చూసింది. కానీ, మరుసటి రోజునే డిజాస్టర్ గా నిలచింది. మరి రాబోయే రోజుల్లో సౌత్ ప్రొడ్యూసర్స్ తమ పాన్ ఇండియా మూవీస్ ను ఆగస్టు నెలలో రిలీజ్ చేస్తారో లేదో చూడాలి.
 

 

Updated Date - Aug 30 , 2026 | 08:35 AM