Venu Swamy: రేంజ్ రోవర్ కొన్న వేణుస్వామి.. ఏకిపారేస్తున్న నెటిజన్స్
ABN, Publish Date - Jan 18 , 2026 | 09:02 PM
ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి (Venu Swamy) గురించి తెలుగువారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Venu Swamy: ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి (Venu Swamy) గురించి తెలుగువారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా ఓపెనింగ్స్ కి పూజలు చేయడం దగ్గర నుంచి కెరీర్ ని మొదలుపెట్టిన ఆయన ఆ తరువాత ఇండస్ట్రీలోని పెద్ద పెద్ద వారికి జాతకాలు చెప్తూ. ఎదిగాడు హీరోయిన్లకు హిట్ వచ్చేలా పూజలు చేయించడం, సినిమాలు హిట్ అవ్వాలని పూజలు జరిపించడం చేస్తూ ఉండే వేణుస్వామి.. అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya) - సమంత (Samantha) విడాకులు తీసుకుంటారు అని చెప్పి ఫేమస్ అయ్యాడు. ఆయన చెప్పినట్లే చై- సామ్ విడిపోవడంతో.. చాలామంది ఈయనను నమ్మడం మొదలుపెట్టారు.
ఇక రాజకీయ నాయకుల జాతకాల గురించి కూడా చెప్పి వివాదాలపాలైన వేణుస్వామి ఈ మధ్య సెలబ్రిటీల జాతకాలు చెప్పడం మానేసి పూజలు చేసుకుంటున్నాడు. తాజాగా ఆయన ఒక కాస్ట్లీ కారును కొనుగోలు చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. వేణుస్వామి పుట్టినరోజున అతని భార్య వీణశ్రీవాణి.. భర్తకు రేంజ్ రోవర్ కారును గిఫ్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. షోరూమ్ లో వేణుస్వామి, వీణ కలిసి కారును కొనుగోలు చేస్తున్న వీడియోను వారిద్దరూ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
బ్లాక్ కలర్ రేంజ్ రోవర్ స్పోర్ట్స్ మోడల్ కారును వేణుస్వామి కొనుగోలు చేశాడు. దీని విలువ సుమారు కోటిన్నర పైనే ఉంటుందని సమాచారం. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో పై నెటిజన్లు మండిపడుతున్నారు. ఎంతమంది కొంపలు కూల్చి సంపాదించిన డబ్బో అది అని కొందరు అంటుంటే.. ఇంకొందరు మాత్రం అందరి జాతకాలు చెప్పేవాడివి.. నీ జాతకం చూసుకొని రోడ్డు మీదకు వెళ్లు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం వేణుస్వామి దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతూ అదిరిందయ్యా వేణుస్వామి అంటూ కామెంట్స్ పెడుతున్నారు.