సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఆశిష్.. గ‌ట్టి ప్లానింగ్‌ తోనే వ‌స్తున్నాడుగా! దేత్త‌డి.. గ్లింప్స్ రిలీజ్‌

ABN, Publish Date - Mar 24 , 2026 | 07:59 PM

రౌడీ బాయ్స్‌, లవ్‌ మీ చిత్రాలతో హీరోగా ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరో ఆశిష్ న‌టిస్తున్న నూత‌న చిత్రం దేత్త‌డి.

రౌడీ బాయ్స్‌, లవ్‌ మీ చిత్రాలతో హీరోగా ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరో ఆశిష్ (Ashish) న‌టిస్తున్న నూత‌న చిత్రం దేత్త‌డి (Dethadi). ఆదిత్యరావు గంగసాని (Aditya Rao Gangasani) దర్శకత్వం వ‌హిస్తుండ‌గా శ్రీ వేంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై (Sri Venkateswara Creations) దిల్ రాజు (Dil Raju), శిరిష్ (Shirish) దీనిని నిర్మిస్తున్నారు. ప్ర‌స‌న్న కుమార్ బెజ‌వాడ (Prasanna Kumar Bezawada) మాట‌లు అందిస్తున్నారు. జునైద్ కుమార్ (Junaid Kumar) సంగీతం అందిస్తున్నారు. దాదాపు ఏడాదిగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం నుంచి ఎట్ట‌కేల‌కు మంగ‌ళ‌వారం అప్డేట్ వచ్చింది. తాజాగా ఓ ప్ర‌త్యేక ఈవెంట్ నిర్వ‌హించి, మూవీ గ్లింప్స్ ను విడుద‌ల చేశారు.

ఈ గ్లింప్స్ చూస్తే ఫ‌క్తు తెలంగాణ నేప‌థ్యంలో సినిమాను రూపొందించిన‌ట్లు అర్థ‌మ‌వుతోంది. బ్యాండ్ మేళంలో బ్యాండ్ వాయిస్తూ ఉండే హీరో, అత‌ని రా అండ్ ర‌స్టిక్ వ్య‌వ‌హారం. ఈ క్ర‌మంలో అత‌ని జీవితంలో ఎదుర‌య్యే ప‌రిణామాల నేప‌థ్యంలో సినిమాను తెర‌కెక్కించిన‌ట్లు తెలుస్తోంది. నేను లేకుండా హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ ఒక్క పండగ కాదు, ధావత్ కాదు! మందు అనుకుంటున్నారు లే నన్ను? బ్యాండోడ్నీ... అనే డైలాగ్స్‌ సినిమాలో హీరో నైజాన్ని తెలియ‌జేసేలా ఉన్నాయి. కాగా ఈ సినిమాను వేస‌విలో ప్రేక్ష‌కుల ఎదుట‌కు తీసుకు రానున్నారు.

Updated Date - Mar 25 , 2026 | 08:30 AM