సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Ashika Ranganath: అల్లు అర్జున్ తో పని చేయడం చాలా బావుంది

ABN, Publish Date - Nov 15 , 2026 | 09:55 PM

ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ అయినా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా చేయాలని ఆశ పడుతూ ఉంటారు. ఆయనతో ఒక చిన్న రోల్ చేసినా చాలు అనుకొనే హీరోయిన్లు చాలామంది ఉన్నారు.

Ashika Ranganath

ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ అయినా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా చేయాలని ఆశ పడుతూ ఉంటారు. ఆయనతో ఒక చిన్న రోల్ చేసినా చాలు అనుకొనే హీరోయిన్లు చాలామంది ఉన్నారు. అలాంటి ఒక అవకాశం వస్తే ఏ హీరోయిన్ కి అయినా ఆనందంతో గంతులు వేస్తుంది. తాజాగా అలాంటి ఆనందంలోనే ఉన్నాను అంటోంది హీరోయిన్ ఆషిక రంగనాథ్ (Ashika Ranganath). నందమూరి కల్యాణ్ రామ్ సరసన అమిగోస్ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తరువాత నా సామీ రంగా సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది.


ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన ఆషిక రంగనాథ్.. అల్లు అర్జున్ తో కలిసి ఒక వాణిజ్య ప్రకటనలో నటించినట్లు తెలుస్తోంది. బన్నీతో స్క్రీన్ షేర్ చేసుకోవడంపై ఆమె తన ఆనందాన్ని వ్యక్తపరుస్తూ కొన్ని ఆయనతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేసింది. 'మీతో కలిసి పనిచేయడం చాలా బాగుంది. మళ్ళీ కలుద్దాం.. బహుశా ఏదైనా సినిమా సెట్‌లో కావచ్చు' అని చెప్పుకొచ్చింది. దీంతో ఈ కలయిక సినిమా కోసం కాదు.. కేవలం యాడ్ కోసమే అని అర్ధమైంది. ఏదిఏమైనా బన్నీతో కలిసి పనిచేయడం గురించి ఆమె తన లోతైన ఉత్సాహాన్ని, ఆనందాన్ని పంచుకోవడం చాలా బావుందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. త్వరలోనే అల్లు అర్జున్ సినిమాలో ఛాన్స్ వస్తుంది అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం వరుస సినిమాలని లైన్లో పెడుతున్నాడు. ఇప్పటికే అట్లీ దర్శకత్వంలో రాకా సినిమా సెట్స్ మీద ఉంది. ఈ సినిమాపైనే ఇండస్ట్రీ కళ్లన్నీ ఉన్నాయి. ఒక్కరూ కాదు ఇద్దరు కాదు ఏకంగా ఐదుగురు స్టార్ హీరోయిన్స్ ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఇది కాకుండా బన్నీ.. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. మొన్నటివరకు ఆగిపోయింది అనుకున్న ఈ ప్రాజెక్టు మళ్లీ పట్టాలెక్కింది. ప్రస్తుతం లోకేష్ బౌండ్ స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నాడని టాక్. ఇక ఈ రెండు సినిమాలు కాకుండా.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బన్నీ నటించే అవకాశాలు ఉన్నాయని టాక్. ఇప్పటికే బోయపాటి - అల్లు అర్జున్ కాంబోలో సరైనోడు లాంటి మాస్ సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంది. ఇక రాకాని పక్కన పెడితే మిగతా రెండు సినిమాల్లో ఆషికాకి ఏమైనా ఛాన్స్ దక్కుతుందేమో చూడాలి.

Updated Date - Nov 15 , 2026 | 09:57 PM