Bhartha Mahasayulaku Wignyapthi: ఊహించని.. సర్ప్రైజ్ ఉంది
ABN , Publish Date - Jan 10 , 2026 | 08:14 AM
'భర్త మహాశయులకు విజ్ఞప్తి చిత్రం కథానాయికలు డింపుల్ హయతీ, ఆషికా రంగనాథ్ సినిమా విశేషాలను మీడియాతో పంచుకున్నారు.
రవితేజ (Ravi Teja) హీరోగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'భర్త మహాశయులకు విజ్ఞప్తి (Bhartha Mahasayulaku Wignyapthi). సుధాకర్ చెరుకూరి నిర్మాత. డింపుల్ హయతీ (Dimple Hayathi), ఆషికా రంగనాథ్ (Ashika Ranganath) కథానాయికలు. సంక్రాంతి సందర్భంగా ఈనెల 13న విడుదలవుతోంది. ఈ సందర్భంగా కథానాయికలు సినిమా విశేషాలను మీడియాతో పంచుకున్నారు.
బాలామణి పాత్రలో ఒదిగిపోయా
సినిమాలో ఎవరూ ఊహించని ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంది. అది వెండితెరపై చూస్తేనే మజా వస్తుందని డింపుల్ తెలిపారు. 'రవితేజ గారితో నాకు ఇది రెండో చిత్రం, బాలామణి అనే పాత్రను కిశోర్ గారు నా కోసం డిజైన్ చేశారు. ఈ సినిమా కథ ప్రతి కుటుంబానికి కనెక్ట్ అవుతుంది. ప్రస్తుతం రిలేషన్షిప్‌లో ఉండే గొడవలు, ఎమోషన్స్ ను దర్శకుడు ఇందులో అద్భుతంగా చూపించారు. స్పెయిన్‌లో షూట్ చేసిన పాటలు, సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయి' అని చెప్పారు.

మోడ్రన్ అమ్మాయిగా కనిపిస్తాను
తన పాత్ర గురించి ఆషికా రంగనాథ్ వివరిస్తూ.."నా సామిరంగ చిత్రంతో పోలిస్తే ఇందులో నా పాత్ర పూర్తి భిన్నంగా ఉంటుంది. మానస శెట్టి అనే మోడ్రన్ అమ్మాయిగా కనిపిస్తాను. నేటి తరం అమ్మాయిలకు రిలేట్ అయ్యే పాత్ర ఇది. కిశోర్ తిరుమల నా పాత్రను, లుక్‌ను సరికొత్తగా తీర్చిదిద్దారు. నాకు తెలుగు అంతగా రాకపోయినా, ఎంతో ఓపిగ్గా నాతో డబ్బింగ్ చెప్పించారు" అని తెలిపారు. 'రవితేజ, సునీల్, వెన్నెల కిశోర్, సత్య వంటి నటులతో కామెడీ టైమింగ్‌ను మ్యాచ్ చేయడం సవాల్ అనిపించింది. మాస్ సాంగ్ షూట్ చేస్తున్నప్పుడు చిరంజీవి గారు సెట్టుకు రావడం నా జీవితంలో మర్చిపోలేని అనుభవం' అని ఆషిక పేర్కొంది.